ఇటీవల ఈ జంట సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారనే వార్త టాలీవుడ్ వర్గాల్లో హల్‌చల్ సృష్టించింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో మెగావైరల్ అవుతోంది. చాలా మంది ఫ్యాన్స్, సినీ విశ్లేషకులు కూడా ఈ వార్తలో నిజం ఉందేమో అని ఆసక్తిగా గమనిస్తున్నారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత రష్మిక – విజయ్ ఇద్దరూ పబ్లిక్‌గా కలిసి కనిపించకపోవడంతో, అభిమానుల కుతూహలం మరింత పెరిగిపోయింది. “ఎప్పుడు మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారో?”, “నిశ్చితార్థంపై ఏదైనా క్లారిటీ ఇస్తారేమో?” అనే ఆసక్తితో నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చలు సాగిస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా నిర్వహిస్తున్న సక్సెస్ మీట్‌కి, హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరవనున్నారని సమాచారం. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడకపోయినా, టాలీవుడ్ వర్గాల్లో ఇప్పటికే ఈ టాక్ గట్టిగా వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ రష్మిక ఈవెంట్‌లో కనిపిస్తారన్న వార్త అభిమానుల్లో భారీ ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేసింది.
ఈ ఈవెంట్‌లో రష్మిక, విజయ్ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం ఖాయమని టాక్. వీరిద్దరి మధ్య జరిగే చిన్న చిన్న సంభాషణలే అయినా సోషల్ మీడియాలో మినిట్లలో వైరల్ కావడం ఖాయం. చాలా మంది ఫ్యాన్స్ ఈ వేడుక కోసం ఎదురుచూస్తున్నారు. “ఈసారి ఇద్దరూ కలసి పబ్లిక్‌గా కనిపిస్తారా?”, “ఏదైనా స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేస్తారా?”, “పెళ్లి తేదీపై ఏదైనా హింట్ ఇస్తారా?” అనే ప్రశ్నలతో నెటిజన్లు ఆసక్తిగా చర్చిస్తున్నారు.ఇక రష్మిక నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా మంచి టాక్‌ను సాధించడంతో ఆమె కెరీర్ మరింత బలపడిందని చెప్పాలి. అదే సమయంలో విజయ్ దేవరకొండ కూడా తన కొత్త సినిమా ప్రిపరేషన్స్‌లో బిజీగా ఉన్నాడు. అయితే, ఈ ఈవెంట్ ద్వారా ఈ జంట మరోసారి పబ్లిక్ ఫ్రంట్‌లో కనిపిస్తే, టాలీవుడ్ మొత్తానికి అదే ప్రధాన ఆకర్షణగా మారడం ఖాయం.
ఫ్యాన్స్ మాత్రం ఒకే డిమాండ్ చేస్తున్నారు — "ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించాలి, చాలు!" అని. ఆ ఒక్క క్లిక్ కోసం సోషల్ మీడియాలో కౌంట్‌డౌన్ మొదలైంది. టాలీవుడ్‌లో లవ్‌బర్డ్స్‌గా పేరుపొందిన ఈ జంట నుంచి ఎప్పుడు సర్‌ప్రైజ్ వస్తుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక చూడాలి మరి… నేడు జరిగే ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సక్సెస్ మీట్‌లో రష్మిక – విజయ్ దేవరకొండ ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో, ఏదైనా బిగ్ రివీల్ ఉంటుందో!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి