మన తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన స్టార్ డైరెక్టర్లు , హీరోలు ఎక్కువ శాతం తమ సినిమాలను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలి అని భావిస్తూ ఉంటారు. సంక్రాంతి పండక్కు ఎక్కువ శాతం సినిమాలను విడుదల చేసే హీరోల లిస్టులో వెంకటేష్ కూడా మంచి వరుసలో ఉంటారు. ఇక సంక్రాంతి పండక్కు ఎక్కువ సినిమాలను విడుదల చేసే ఆలోచనలో ఉండే దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ముందు వరుస లోనే ఉంటారు. ఇకపోతే 2024 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమా విడుదల అయింది. ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విక్టరీ వెంకటేష్ హీరో గా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కు మాత్రం ఇటు వెంకటేష్ నటించిన సినిమా గాని , అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సినిమా కానీ విడుదల కావడం లేదు. వీరిద్దరి కాంబోలో మరికొన్ని రోజుల్లోనే ఓ సినిమా స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమాలు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై పక్కా క్లారిటీ లేదు. కానీ వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కు విక్టరీ వెంకటేష్ హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ , మాటలు , స్క్రీన్ ప్లే అందించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాని రీ రిలీజ్ చేయరున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 1 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలవడింది. మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: