ఈ మధ్యకాలంలో కొంతమంది నటీనటులు మాట్లాడే మాటలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. ముఖ్యంగా ఎన్నో సినిమాలు చేసిన అనుభవం ఉన్న సీనియర్ నటులు కూడా ఈ మాటలు మాట్లాడంతో చాలామందికి విసుగు తెప్పిస్తోంది.ఇక ఈ మధ్యకాలంలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ఈవెంట్ లో పాల్గొన్నా కూడా ఆయన చేసే వ్యాఖ్యల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కొంత మందిని టార్గెట్ చేస్తూ బూతు పురాణం మాట్లాడడంతో అసలేంటి ఈయన ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదు..సోషల్ మీడియాలో ఇంతే నెగెటివిటీ వచ్చినా పట్టించుకోవడం లేదు అంటూ మండి పడుతున్నారు. అయితే తాజాగా కామెడీ బ్రహ్మ లెజెండ్రీ కమెడియన్ అయినటువంటి పద్మశ్రీ బ్రహ్మానందం పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన్ని పట్టుకొని ముసలి ముండా కొడుకు అని రాజేంద్రప్రసాద్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

దీంతో రాజేంద్రప్రసాద్ కి ఇదేం పోయేకాలం..అందర్నీ ఇలా మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక తాజాగా రాజేంద్రప్రసాద్,బ్రహ్మానందం లు ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్నారు. అయితే ఈ సినిమా ఈవెంట్లో బ్రహ్మానందం మాట్లాడాక రాజేంద్రప్రసాద్ ని మాట్లాడమని మైక్ ఇచ్చారో ఏమోగానీ ఆ మైక్ అందుకున్న రాజేంద్రప్రసాద్ శ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్లు మాట్లాడటం  అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. దాంతో బ్రహ్మానందం కలగజేసుకొని ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా సార్.. పెద్దోళ్ళమైన మీ శిష్యులమే కదా సార్  అని అన్నారు. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ బ్రహ్మానందం ని పట్టుకొని కానీ ముసలి ముండా కొడుకువ్ కదా నువ్ అని మొహం మీద అనేసి ఎవరు అని బ్రహ్మానందం ప్రశ్నించడంతో నేనే అంటూ మాట దాటేశారు. 

అలా స్టేజ్ పైనే లెజెండ్రీ కమెడియన్ బ్రహ్మానందం ని పట్టుకొని ముసలి ముండా కొడుకు అని మాట్లాడి మళ్ళీ మాట మార్చేసి తప్పించుకున్నాడు.ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు అసలు నీకు బుద్ధుందా..వయసు పెరిగినా కాస్తయినా ఇంగిత జ్ఞానం రావడం లేదు.ఒక నటుడిగా ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నావు. నీలో ఆ హుందాహతనమే కనిపించడం లేదు అంటూ ఫైర్ అవుతున్నారు.ఇక బ్రహ్మానందంని మాత్రమే కాదు రాజేంద్రప్రసాద్ రోజా, కమెడియన్,అలీ, డేవిడ్ వార్నర్ వంటి ఎంతోమంది పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: