అసిన్ వ్యక్తిత్వం, నేచురాలిటీ, ఒకవైపు సంప్రదాయ విలువలు ఇతర వైపు మోడరన్ శైలి—ఇవన్నీ కలిసి ఆమెకు విభిన్న ప్రేక్షక వర్గాల్ని ఆకర్షించాయి. అందుకే పాపులరిటీకి తగినంత ప్రతిధ్వని వచ్చేయడం సహజం. అయితే చాలాసార్లు పాపులారిటీతో పాటు విభిన్న రకాల రూమర్లూ, విలువలు దెబ్బతీసే కథాంశాలు సోషల్ మీడియాలో, మీడియా చర్యంలో ఉత్పన్నమవుతాయి. అలాంటి ఒక రూమర్ అసిన్ మరియు తెలుగు హీరో మధ్య ప్రేమ సంబంధం, పెళ్లి వార్తలు బాగా ఎక్కువుగా వినిపించాయి. సోషల్ మీడియాలోా మరోసారి అదే వార్త ట్రెండ్ అవుతుంది. ఆమె తెలుగు హీరో రవితేజ తో ప్రేమాయణం కొనసాగించింది అని .."అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి " సినిమా షూటింగ్ టైంలో వీరిద్దరి మధ్య చనువు బాగా పెరిగి అది లిమిట్స్ క్రాస్ అయ్యేలా ప్రేమగా మారింది అని.. వీళ్ళు ప్రేమించుకుంటున్నారు అని పెళ్లి చేసుకోబోతున్నారు అని రకరకాలుగా వార్తలు వినిపించాయి .
కానీ ఫైనల్లీ అది ఏదీ జరగలేదు అసలు వీరి మధ్య ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ అప్పట్లో వీళ్ళ మధ్య చనువు చూసినవాళ్లు వీళ్ళ అమర ప్రేమికులు అంటూ తెగ తెగ మాట్లాడేసుకున్నారు. లాస్ట్ కి రవితేజ వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు ..అసిన్ వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. కానీ ఆ రూమర్ మాత్రం అలాగే చరిత్రలో నిలిచిపోయింది మరొకసారి సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ను వైరల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. ప్రస్తుతం కూడా కొంతమంది అదే పాత రూమర్‌స్‌ను రీసైకిల్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఎలాంటివైనా వ్యక్తిగత జీవితం, సంబంధాల గురించి మాట్లాడుతూ ఉండేటప్పుడు, నిజమైన ఆధారల గురించి పరిశీలించడం మరియు వ్యక్తుల గౌరవాన్ని గౌరవించడం ముఖ్యమని అందరు గుర్తుంచుకోవాలి అంటున్నారు సినీ పెద్దలు. సో..రవితేజ కి అసిన్ మధ్య లవ్ అనేది పూర్తిగా అవాస్తవం అని క్లారిటీకి వచ్చేసింది. అసిన్ హ్యాపీగా భర్త తో ఉంది. రవితేజ కూడా చేతికి వచ్చిన సినిమా లు చేసుకుంటున్నారు..!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి