మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా అఖండ 2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటూ ఓవర్సీస్ లో కూడా బాగానే జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇతర దేశాలలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలోనే జర్మనీలో నివసిస్తున్న కొంతమంది తెలుగు ఎన్నారైలలో ఒకరైన రాజశేఖర్ పర్ణపల్లి బాలయ్య అభిమాని.. అఖండ 2 సినిమాకి సంబంధించి టికెట్ ను ఏకంగా రూ .2 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ఈ విషయంపై జర్మనీలో ఈ సినిమాని విడుదల చేస్తున్న శ్రీకాంత్ కుడితిపూడి మాట్లాడుతూ.. "అనంతపురం నుంచి జర్మనీకి వచ్చాము. బాలయ్య పైన ఉండే అభిమానం ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. బాలయ్య సినిమా వస్తోందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ జర్మనీలో కూడా అలాంటి వాతావరణమే కనిపిస్తూ భారీగా ప్రమోషన్లను కూడా నిర్వహిస్తామంటూ" తెలియజేశారు. మొత్తానికి జర్మనీలో అఖండ 2 సినిమా టికెట్ ధర 2 లక్షలకి అమ్ముడుపోయిందని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. రాబోయే రోజుల్లో బాలయ్య క్రేజ్ మరింత పెరుగుతుందని కూడా అభిమానులు భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి