చైనాకి చెందిన ‘ నే జాహ్ ’ అనే యానిమేషన్ సినిమా ఏకంగా 2 బిలియన్ డాలర్స్ కి పైగా రాబట్టింది. ఈ నెంబర్స్ అవతార్ 2 రేంజ్ వసూళ్లు అని చెప్పాలి. దీనిని బట్టి కంటెంట్ లో దమ్ము ఉండాలే కాని .. యానిమేషన్ సినిమాల హవా ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్ధం అవుతోంది. ఇదిలా ఉంటే మరో యానిమేషన్ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సెట్ చేస్తూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఆ సినిమానే ‘ జూటోపియా 2 ’. హాలీవుడ్ కి చెందిన ఈ సినిమా కేవలం చైనా లోనే ఒక్క రోజులో ఏకంగా 104 మిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్లు కొల్లగొట్టింది.
అంటే ఇది ఇండియన్ కరెన్సీ లో ఏకంగా రు. 930 కోట్లు అని చెప్పాలి. చైనా మార్కెట్ లో ఇది కేవలం ఒక్కరోజు వసూళ్లు మాత్రమే కావడం గమనార్హం. అలాగే అవెంజర్స్ ఎండ్ గేమ్ డే 1 రికార్డు గ్రాస్ ని క్రాస్ చేసి కొత్త రికార్డు సెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇదంతా కేవలం ఒక యానిమేషన్ సినిమా వసూళ్లు చేయడం విశేషం. దర్శకులు జేరెడ్ బుష్ అలాగే బైరన్ హోవార్డ్ లు తెరకెక్కించిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకెన్ని సంచనాలు సెట్ చేసి .. వసూళ్లు సాధిస్తుందో ? చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి