నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ , నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో విజయాలను అందుకొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకున్నాడు. ఇకపోతే బాలయ్య తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుల అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందింది. అలా అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందిన సినిమా కావడంతో అఖండ 2 మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే డిసెంబర్ 5 వ తేదీన ఈ సినిమా విడుదల కానుండడంతో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్స్ ను రాబడుతుంది అని బాలయ్య అభిమానులు కట్టి నమ్మకంతో ఉన్నారు.

ఇకపోతే ఈ మధ్య కాలంలో మూవీ లవర్స్ చాలా మంది సినిమాలు థియేటర్లలో చూడడానికి ఏ స్థాయిలో ఆసక్తి చూపిస్తున్నారో , ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో మూవీలను చూడడానికి కూడా అదే స్థాయిలో ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక డిసెంబర్ 5 వ తేదీన టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక మందన ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా నెట్ ఫ్లిక్స్  ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ కానుంది. దానితో ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఓ టి టి విడుదల వల్ల బాలయ్య హీరోగా రూపొందిన అఖండ 2 మూవీ ఓపెనింగ్స్ కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా అని అనుమానాలను కొంత మంది వ్యక్త పరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: