సూపర్ స్టార్ మహేష్ బాబు కి తెలుగు సినీ పరిశ్రమలో ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన నటించిన సినిమా విడుదల అవుతుంది అంటే చాలు థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అలాగే మహేష్ నటించిన సినిమాలకు హిట్టు , ఫ్లాప్ టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా అద్భుతమైన కలెక్షన్లు దక్కుతూ ఉంటాయి. ఆయన నటించిన సినిమాకు గనక బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చినట్లయితే సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తూ ఉంటుంది. అంతటి క్రేజ్ కలిగిన మహేష్ బాబు కు సంబంధించిన చాలా సినిమాలను ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. రీ రిలీజ్ లో కూడా మహేష్ నటించిన సినిమాలకు అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. కొంత కాలం క్రితం మహేష్ బాబు హీరో గా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బిజినెస్ మాన్ అనే సినిమాను పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. ఆ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా 5.85 కోట్ల రేంజ్ లో కలెక్షన్లు దక్కాయి.

సినిమా రీ రిలీజ్ లో భాగంగా కలెక్షన్ల విషయంలో ఎన్నో కొత్త కొత్త రికార్డులను సృష్టించింది. ఇలా ఇప్పటికే రీ రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్లను రాబట్టిన బిజినెస్ మాన్ మూవీ ని తాజాగా మరోసారి రీ రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ కి రీ రీ రిలీజ్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ జనాలను లభిస్తుంది. తాజాగా ఈ సినిమాకు రీ రీ రిలీజ్ లో భాగంగా హైదరాబాద్ నగరం లోనే 65 లక్షలకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రీ రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు 1.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు వచనాలు తెలుస్తుంది. దానితో మొత్తంగా ఈ సినిమాకు రెండు సార్లు కలుపుకొని 7 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. అలా బిజినెస్ మాన్ మూవీ రీ రిలీజ్ లలో అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తూ ఉండడంతో మహేష్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: