టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న హీరోలలో రామ్ పోతినేని ఒకరు. ఈయన వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాస్ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని , సూపర్ సాలిడ్ గుర్తింపును దక్కించుకున్నాడు. ఆ తర్వాత రామ్ ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇలా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈయనకు గత కొంత కాలంగా వరుస పెట్టి భారీ ఆపజయాలు దక్కుతున్నాయి. ఈయన ఆఖరుగా నటించిన ది వారియర్ , స్కంద , డబల్ ఈస్మార్ట్ మూవీ లు రామ్ కి ఘోరమైన నిరాశను మిగిల్చాయి. అలాంటి మూడు ప్లాప్స్ తర్వాత ఈయన తాజాగా ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ తాజాగా విడుదల అయ్యింది. ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది అని చాలామంది భావించారు. కానీ ఈ సినిమా ఇప్పటివరకు డీసెంట్ కలెక్షన్లను వసూలు చేసింది ... కానీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను మాత్రం వసూలు చేయలేకపోయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

3 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 3.70 కోట్ల కలెక్షన్లు దక్కగా , సిడెడ్ లో 52 లక్షలు , ఆంధ్ర లో 2?72 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 3 రోజుల్లో 6.94 కోట్ల షేర్ ... 11.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 3 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 78 లక్షలు , ఓవర్సీస్ లో 1.90 కలెక్షన్లు దక్కాయి. 3 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 9.62 కోట్ల షేర్ ... 17.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి 27.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా జరగగా ... ఈ మూవీ 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ సినిమా మరో 18.30 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: