గత కొన్ని నెలలుగా టాలీవుడ్ హీరోయిన్ సమంత, ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరు ప్రేమించుకుంటున్నారనే వార్తలు వినిపించాయి. ఆ రూమర్స్ కి చెక్ పెడుతూ ఎట్టకేలకు వివాహ బంధంతో ఈ రోజున (డిసెంబర్ 1) ఒకటవ్వడంతో అభిమానులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు అత్యంత సన్నిహితుల సమక్షంలో లింగ బైరవి ఆలయంలో ఈ జంట ఒక్కటయ్యారు. తాజాగా సమంత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా రాజ్ నిడిమోరుతో పెళ్లికి సంబంధించి ఫోటోలను షేర్ చేసింది. దీంతో సినీ సెలబ్రిటీలు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


ముఖ్యంగా సమంత ఎరుపు రంగు చీరలో చాలా అందంగా కనిపిస్తోంది. రాజ్ నిడిమోరు గోల్డెన్ కలర్ షర్వాని ధరించారు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులకు చూడముచ్చటగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో సమంత, రాజు మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందనే విషయంపై అభిమానులు ఆరా తీయగా దాదాపుగా వీరిద్దరి మధ్య 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు వినిపిస్తోంది. రాజ్ నిడిమోరు 1975లో పుట్టగా, సమంత 1987లో జన్మించారు. దీన్నిబట్టి చూస్తే వీరిద్దరి మధ్య 12 ఏళ్లు గ్యాప్ ఉన్నట్లుగా అభిమానులు వైరల్ గా చేస్తున్నారు.


సమంత మొదటిసారి ఏమాయ చేసావే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవ్వగా ఆ సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి 2017లో వివాహం చేసుకోగా, కొన్ని కారణాల చేత 2021లో విడిపోతున్నామంటూ ప్రకటించారు. ఆ తర్వాత సమంత కెరియర్ మీద ఫోకస్ చేయగా అలాంటి సమయంలో మయూసైటిస్ వ్యాధికి గురయ్యారు. ఈ క్రమంలోనే రాజ్ తో తనకు మంచి సన్నిహిత్యం ఏర్పడడంతో ఇద్దరు కలిసి కొన్ని సంస్థలలో పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఇద్దరు కలిసి ఒకే చోట కనిపిస్తూ తిరిగేవారు.. దీంతో వీరిద్దరి మధ్య రూమర్స్ వినిపించాయి..కానీ ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు ఈ జంట.రాజ్, సమంతకు ఇద్దరికి కూడా ఇది రెండవ వివాహమే.

మరింత సమాచారం తెలుసుకోండి: