- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత - దర్శకుడు రాజ్ నిడుమోరు పెళ్లి సన్నిహితుల సమక్షంలో కోయంబత్తూర్ లో ఎంతో సింపుల్గా జరిగింది. సామ్ , రాజ్ ఇద్ద‌రికి కూడా ఇది రెండో పెళ్లి కావ‌డం విశేషం. సామ్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సామ్‌ పెళ్లి తర్వాత అందరూ ఆమెను ట్రోల్ చేస్తూ అక్కినేని నాగచైతన్య చాలా మంచివాడు అని .. ది ఫ్యామిలీ మెన్ టు వెబ్ సిరీస్ టైం నుంచే రాజ్ తో సమంతకు రిలేషన్ ఉందని అందుకే చైతన్యకు విడాకులు ఇచ్చిందని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా సామ్ పై ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగచైతన్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తాను నటించిన మొదటి వెబ్ సిరీస్ ధూత రిలీజ్ అయ్యి 2 ఏళ్లు అయిన సందర్భంగా ఆ సిరీస్ ని సెట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాడు.


ఒక నటుడుగా ఎంతో సృజనాత్మకంగా నిజాయితీగా కథను ఎంచుకొని ఉత్తమమైన నటనను కనపరిచినప్పుడు ప్రజలు కనెక్ట్ అవుతారు అని తెలిపిన వెబ్ సీరిస్ ధూత అని .. నాగచైతన్య తన కామెంట్ లో రాసుకు వచ్చాడు. ఈ ధూత వెబ్ సిరీస్ తో తనకు మంచి ఎనర్జీ వచ్చిందని ... ఇది రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతుంది దీన్ని సాధ్యం చూసిన బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగచైతన్య కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ పోస్ట్ పై కింగ్ అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. సమంత పెళ్లి గురించి మాట్లాడుతూ సమంత పెళ్ళికి వెళ్లలేదా ? వాళ్ళు పిలవలేదా అని కొందరు కామెంట్ చేస్తుంటే ఈ రోజు చాలా బాగా గుర్తొచ్చావు బ్రో అని మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు. సగం దరిద్రం వదిలింది అనుకో అందరూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: