టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ నటించిన సినిమాలకు ఇప్పటికి కూడా అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్లు లభిస్తున్నాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్న వీరిద్దరి సినిమాలకు మొదటి రోజు సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. దానితో వీరు నటించిన సినిమాలే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నటించిన మూవీలలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీలుగా ఉండడం విశేషం. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఏవి అనేది తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన సైరా నరసింహా రెడ్డి మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 38.75 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన ఆచార్య మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 29.50 కోట్ల షేర్ కలెక్షన్లను దక్కాయి. ఈ మూవీ లో చిరంజీవి తో పాటు చిరంజీవి కుమారుడు అయినటువంటి రామ్ చరణ్ కూడా ఓ కీలకమైన పాత్రలో నటించాడు. నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా రూపొందిన డాకు మహారాజ్ సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25.72 కోట్ల కలెక్షన్లు దక్కగా , బాలకృష్ణ హీరో గా రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25.35 కోట్ల షేర్ కలెక్షన్లను దక్కాయి. ఇక చిరంజీవి హీరో గా రూపొందిన ఖైదీ నెంబర్ 150 సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 23.35 కోట్ల కలెక్షన్లను దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: