ఇదిలా ఉండగా, తాజాగా ‘రాజా సాబ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన కీలక సమాచారం బయటకు వచ్చింది. డిసెంబర్ 25వ తేదీన అమెరికాలో ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే, ప్రభాస్‌కు తెలుగులో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అలాంటి స్టార్ హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తెలుగు రాష్ట్రాల్లో కాకుండా యూఎస్‌లో నిర్వహించడం సరైందా? అంటూ కొంతమంది నెటిజన్లు, అభిమానులు నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. “తెలుగు అభిమానులను పక్కన పెట్టారా?” అనే రకమైన చర్చ కూడా జరిగింది.
ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, యూఎస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం.
డిసెంబర్ 25వ తేదీన యూఎస్‌లో ఈవెంట్ జరగనుండగా, డిసెంబర్ 27వ తేదీన హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట.
హైదరాబాద్‌లో జరగబోయే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్టులుగా ముగ్గురు స్టార్ సెలబ్రిటీలను ఆహ్వానించబోతున్నట్లు డైరెక్టర్ మారుతి ప్లాన్ చేశారన్న వార్త వైరల్ అవుతోంది.
ఆ ముగ్గురు స్టార్స్ ఎవరో కాదు —
*ప్రభాస్‌కు ఎంతో ఇష్టమైన డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి,
*మారుతికి బిగ్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన నేచురల్ స్టార్ నాని,
*ప్రస్తుతం ప్రభాస్‌తో వర్క్ చేస్తున్న స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.
ఈ ముగ్గురిని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్టులుగా ఆహ్వానించినట్లు సమాచారం అందుతోంది. ఈ న్యూస్ బయటకు రావడంతో సోషల్ మీడియా మొత్తం ఇదే టాపిక్‌తో హోరెత్తిపోతోంది.
ఈ ముగ్గురికీ తమకంటూ పాన్ ఇండియా లెవెల్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి స్టార్స్ ఒకే స్టేజ్‌పై కనిపిస్తే ఆ వాతావరణం ఎలా ఉంటుందో అని అభిమానులు ఇప్పటి నుంచే ఊహించుకుంటున్నారు. స్టేజ్‌పైకి వచ్చి ప్రభాస్ గురించి వారు ఏం మాట్లాడతారు? తమ రాబోయే సినిమాల గురించి ఏవైనా అప్డేట్స్ ఇస్తారా? అన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో విపరీతంగా పెరిగిపోయింది. మొత్తానికి, డైరెక్టర్ మారుతి ఏం ప్లాన్ చేసినా పక్కా ప్లానింగ్‌తోనే చేస్తారు అన్న విషయం మరోసారి ప్రూవ్ అయిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా డబుల్ ట్రీట్ అనే చెప్పాలి. ఇక ఈ ఈవెంట్స్ అధికారికంగా కన్ఫర్మ్ అయితే, ప్రభాస్ క్రేజ్ మరోసారి ఏ రేంజ్‌లో ఉందో ప్రపంచానికి చూపించనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి