రేటింగ్ : 5/5

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :  

జమిందారీ కుటుంబమైన బంగార్రాజు తరతరాలుగా శివ క్షేత్రాన్ని కాపాడుతూ వస్తుంటారు. ఈ క్రమంలో ఆ కుటుంబ వారసుడు కష్టాల్లో ఉన్నప్పుడు బంగార్రాజుని రక్షించడానికి తాత స్వర్గం నుండి వస్తాడు. చిన బంగార్రాజుని తాత ఎలా కాపాడాడు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

బంగార్రాజు పాత్రలో నాగార్జున తన ఎనర్జీతో మెప్పించారు. ఆయన ఆహార్యం.. కామెడీ.. ఉత్సాహం.. ప్రత్యేకంగా నాగార్జున ఆరా సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ప్రతి ఒక్క సినీ అభిమాని ఎంజాయ్ చేసేలా సినిమలో ఆయన నటన ఉంది. ఇక ఆయన వారసుడు నాగ చైతన్య కూడా అదే ఉత్సాహంతో కనిపించాడు. ఈ సినిమాలో నాగ చైతన్య పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. దసరా బుల్లోడు తరహాలో చలాకీ పాత్రలో నాగ చైతన్య ప్రేక్షకుల మనసులు గెలిచాడు. నాగ చైతన్యకు ఈ సినిమా ఫ్యామిలీ మాస్ హీరో ఇమేజ్ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ తరహా మాస్ ఎంటర్టైనింగ్ డైలాగులు చెప్పాలంటే అది అక్కినేని ఫ్యామిలీకే చెల్లుతుంది అనేలా సినిమాలో నాగార్జున, నాగ చైతన్యలు చేశారు. రమ్యకృష్ణ కూడా అద్భుతంగా చేశారు. కృతి శెట్టి కూడా తన బెస్ట్ ఇచ్చింది. ఈ తరహా పాత్రలు ఆమెని ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేస్తాయి.

సాంకేతికవర్గం పనితీరు :  

బంగార్రాజు సినిమాకు స్క్రీన్ ప్లే చాలా బాగా కుదిరింది. కల్పిత కథను దర్శకుడు తన క్రియేటివిటీతో ఎంతో ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించాడు. నవరత్నాల తరహాలో సినిమాలో అన్ని అద్భుతంగా పడాయి. ప్రతి రత్నం అద్భుతంగా తెరకెక్కించబడిందని చెప్పొచ్చు. ఇక సినిమాకు అనూప్ రూబెన్స్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. అనూప్ అమేజింగ్ మ్యూజిక్ అందించాడు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్ని విషయాల్లో అనూప్ తన ప్రతిభ కనబరిచాడు. మోస్ట్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరక్టర్ ఇన్ టాలీవుడ్ అనూప్ రూబెన్స్ అని చెప్పొచ్చు. బంగార్రాజు సినిమాలో గ్రాఫిక్స్, వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. బాహుబలి కన్నా అద్భుతమైన గ్రాఫిక్స్ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా స్వర్గం సీక్వెన్సెస్ చాలా అద్బుతంగా తీర్చిదిద్దారు. ఎడిటింగ్ చాలా బాగా కుదిరింది. బంగార్రాజు సినిమాను 8 ఏళ్ల వయసు వారి నుండి 80 ఎళ్ల వయసు వారు కూడా చూసి ఎంజాయ్ చేసేలా తెరకెక్కించాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. దర్శకుడు నంది అవార్డ్ విన్నింగ్ కు అర్హుడు. ఇలాంటి అద్భుతమైన సినిమా చేయాలి అంటే అది తన వల్లే అవుతుంది అనిపించేలా చేశాడు కళ్యాణ్ కృష్ణ. తెలుగు చల చిత్ర మేటి దర్శకులు వంశీ, ఈవీవీలకు ఈక్వల్ గా ఒకానొక దశలో వారిని మించేలా దర్శకత్వ ప్రతిభ చూపాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. సినిమాలో కాస్టూంస్ చాలా బాగా కుదిరాయి. బంగార్రాజు శారీస్ చాలా పాపులర్ అవుతాయని చెప్పొచ్చు. దశాబ్ధ కాలంలో ఈ తరహా అందాలను తెర మీద చూపించలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది సోగ్గాడే చిన్ని నాయనాకి ఒక మంచి కొనసాగింపు దాన్ని మించి బంగార్రాజు ఉందని చెప్పొచ్చు.

విశ్లేషణ :

బంగార్రాజు ఓ అద్భుతమైన సినిమా ఫ్యామిలీ సినిమాల్లో ఈ సినిమా ఒక రిఫరెన్స్ గా ఉంటుంది. సినిమా తెలుగు నేటివిటీతో పాటుగా హీరోయిజంతో వచ్చింది. అందుకే ఇది అసలు సిసలైన సంక్రాంతి పండుగ సినిమా. హ్యాట్సాఫ్ హాఫ్ టూ మేకర్స్. ఈ సినిమాని సంక్రాంతికి తీసుకు రావాలన్న నాగార్జున నిర్ణయం ప్రశంసనీయం. కనీసం రెండు నెలలు ఈ సినిమా థియేటర్లలో ఆడుతుంది. ఒక మంచి కథ.. మొదటి నుండి చివరి వరకు ఎంటర్టైన్ చేసిన సినిమా బంగార్రాజు.

బాటం లైన్ :

ఫ్యామిలీ మొత్తం చూసి మన నేటివిటీ.. మన మూలాలను వెతుక్కునేలా చేస్తుంది బంగార్రాజు.
   


మరింత సమాచారం తెలుసుకోండి: