చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న ‘సైరా’ మూవీ 270 కోట్ల బడ్జెట్ తో నిర్మించడంతో ఈ మూవీ టాక్ విషయంలోనే కాదు మరే విషంలో అయినా చిన్న వివాదంలో చిక్కుకున్నా ఈ మూవీకి భారీ నష్టాలు వచ్చే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితులలో ‘సైరా’ మూవీకి ఉయ్యాలవాడ వంశీయుల ముప్పు తప్పదా అన్న సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా వాస్తవ చరిత్రకు విరుద్ధంగా మెగా కాంపౌండ్ ఈ మూవీని నిర్మిస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి చారిత్రాత్మక సినిమాను కేవలం ఒక చరిత్రగా తీస్తే ఎవరు చూడరు. అందువల్ల అనేక కమర్షియల్ అంశాలను జోడిస్తూ చరిత్రకు దూరంగా ఇలాంటి భారీ సినిమాలు తీస్తారు.

అలా తీయకపోతే ఇలాంటి సినిమాలకు మాస్ కనెక్ట్ కారు. ఇప్పుడు ‘సైరా’ విషయంలో కూడ ఇదే జరుగుతోంది అని టాక్. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు లేకపోవడంతో కేవలం కొందరు చరిత్రకారులు చెపుతున్న విషయాలను ఉయ్యాలవాడ ప్రాంతలో ప్రజలు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకునే విషయాలను ఆధారంగా చేసుకుని ఈ మూవీ రచయితలు పరుచూరి బ్రదర్స కథ అల్లారు.

ఈ విషయాలు అన్నీ ఉయ్యాలవాడ కుటుంబ సభ్యుల వరకు వెళ్ళడంతో తమకు ఈ మూవీని రిలీజ్ కు ముందు చూపించాలని తమకు ఏదైనా అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే చెపుతామని అంటూ ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు చాలామంది ఈ మూవీ నిర్మాత చరణ్ తో రాయబారాలు చేస్తున్నట్లు టాక్. ఈ విషయం పై చరణ్ స్పందించకపోతే ఈ మూవీ విడుదలను ఆపుచేయమని కోర్టుకు వెళతామని బెదిరిస్తున్నట్లు కూడ తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ విషయంలో కొన్ని కేసులను ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు కోర్టులో వేసిన పరిస్థితులలో ఈ విషయమై ఎదో ఒకటి రాజీ చేసుకోమని లేదంటే చివరి నిముషంలో సమస్యలు వస్తాయని చిరంజీవి చరణ్ ల సన్నిహితులు కూడ సూచిస్తున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: