అమెరికాలో అక్రమ వీసాల
కారణంగా నిర్భంధానికి గురయిన భారతీయ విద్యార్ధుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని
కేంద్రం తేల్చి చెప్పింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ విద్యని
అభ్యసిస్తున్న విద్యార్ధులని అక్కడి అధికారులు వేదింపులకి గురిచేస్తున్నారని ఈ
విషయంపై దృష్టి సారించాలని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు, భారత్‌లోని
ఆ దేశ రాయబారి కెన్నెత్ జస్టర్‌కు ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వ పత్యేక కార్యదర్శి కంభంపాటి రామోహన్ రావు
లేఖని గత నెల 31న లేఖలు రాశారు.

విద్యార్ధులపై వేదింపులు ఆపేలా చర్యలు తీసుకోవాలని వారికి తగిన న్యాయం జరిగేలా చేయాలని రాసిన లేఖపై స్పందించిన సుష్మా అందుకు ప్రతిగా లేఖని పంపారు.నిర్భంధంలో ఉన్న విద్యార్థుల భద్రతలో రాజీలేదని, వారి రక్షణే ప్రధానమైన అంశంగా పరిగణిస్తున్నామని ఆమె తెలిపారు.

సదరు యూనివర్సిటీ ద్వారా చదువుకుంటున్న విద్యార్ధులకి ఆయా ఏజెన్సీలు,కన్సల్టెన్సీలు, మరే విధంగా అయినా సరే న్యాయం జరిగేలా చూడాలని రాయబార కార్యాలయ అధికారులని కోరినట్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే వాషింగ్టన్ డీసీలోని రాయబార కార్యాలయంలో 24 గంటల టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉందని ఆమె తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి