అమెరికాలో విదేశీ విద్యార్ధులు అక్రమంగా ఉండటాన్ని నిరోధించడం కోసం ప్రతికూల వీసా విధానాన్ని గతంలోనే యూఎస్‌సీఐఎస్ ప్రవేశ పెట్టింది. ఈ మేరకు ట్రంప్ నుంచీ కీలక ఆదేశాలు కూడా అప్పట్లో అందుకుంది.కానీ ఇప్పుడు అమెరికా జిల్లా కోర్టు ఇమ్మిగ్రేషన్ అధికారులకి, ట్రంప్ కి షాక్ ఇస్తూ కీలక తీర్పు ఇచ్చింది. యూఎస్‌సీఐఎస్  ప్రవేసపెట్టిన వీసా విధానాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ తీర్పు చెప్పింది.

 Image result for student visa america news

దాంతో అమెరికా వ్యాప్తంగా విద్యని అభ్యసిస్తున్న సుమారు రెండు లక్షల మంది భారతీయ విద్యార్ధులు ఊరట చెందారు. తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది విధించిన ఈ వీసా నిభంధనల ప్రకారం 180 రోజులు అమెరికాలో అక్రమంగా నివసించేవారి పై మూడేళ్ళ నిషేధం విధిస్తారు, ఏడాదికి పైగా నివసించే వారిపై పదేళ్ళ నిషేధం విధిస్తారు. అంతేకాదు

 Image result for student visa america news

ఈ నిషేధం ఆ విద్యార్ధులపై ఆధారపడి ఉండే వారికి కూడా వర్తిస్తుంది. అయితే  తాజాగా వచ్చిన కోర్టు తీర్పుతో విద్యార్ధులు ధీమాగా ఉన్నారు. ఈ వీసా విధానంపై అమెరికాలోని పలు కాలేజీలు కోర్టులని ఆశ్రయించగా కోర్టు తాజాగా ఈ తీర్పుని వెల్లడించడంతో కాలేజీ యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: