ప్రస్తుతం ప్రపంచాన్ని ఏదైనా వణికిస్తోంది అంటే అది కరోనా వైరస్ ఏ.. ఈ కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది ప్రజలు గుట్టలు గుట్టలుగా చచ్చిపోతున్నారు. అయితే చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాపించే స్వభావం ఉన్న వైరస్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం ప్రకటించిన సంగతి విదితమే. 

 

ఇక పోతే ఈ కరోనా వైరస్ గురించి చైనా ఆరోగ్య కమిషన్ సంచలన ప్రకటన చేసింది. కరోనా వైరస్ వారి దేశంలో నెమ్మదిస్తోందని చైనా ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కమిషన్ అధికార ప్రతినిథి మి ఫెంగ్ నిన్న గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్నీ ప్రకటించారు. 

 

అంతేకాదు.. కరోనా వైరస్ ప్రారంభ స్థానమైన హుబేయ్ ప్రావిన్స్‌లో మొట్టమొదటిసారి 10 కంటే తక్కువ కేసులు నమోదు అయ్యాయి అని ఆయన తెలిపారు. ఈ ప్రావిన్స్‌లో కొత్తగా కేవలం 8 అంటే 8 ఏ కేసులు నమోదు అయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ప్రకటన చేశారు. కాగా ఈ కరోనా వైరస్ కారణంగా నిన్న నే ఓ కరోనా వైరస్ మొట్టమొదటి మరణం భారత్ లో సంభవించింది. కాగా.. మన భారత్ లోకి ప్రవేశించిన ఈ కరోనా వైరస్ వ్యాప్తిని ఆపేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: