అమెరికాలో ఒక వైపు కరోనా చేస్తున్న మారణ హోమానికి ఎంతోమంది అమాయక ప్రజలు బలై పోయారు. లక్షలాది మంది అమెరికన్స్ కరోనా బారిన పడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ సమయంలో అమెరికా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కరోనాపైనే చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో డెమోక్రటిక్ పార్టీ తరువుపున అమెరికా అధ్యక్షుడుగా ఎవరు నిలబడతారు అనే సందిగ్ధత కి తెరపడింది..

IHG

తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచీ తాను తప్పుకుంటున్నట్టుగా బెర్నీ శాండర్స్ ప్రకటించారు. జో బిడెన్ మాత్రమే డెమోక్రటిక్ పార్టీ తరపునుంచీ అధ్యక్ష అభ్యర్ధిగా నామినేషన్ వేసే అవకాశం ఉందని తెలిపారు. జో బిడెన్ ని నేను అభినందిస్తున్నాను, భవిష్యత్తులో బిడెన్ తో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నయాని తప్పకుండా బిడెన్ తో పనిచేస్తానని తన మద్దతు దారులని ఉద్దేశించి ప్రకటించారు. ఇప్పటి వరకూ నాకు మద్దతుగా నిలిచి , నాకోసం కష్టపడి పనిచేసిన ప్రతీ ఒక్క కార్యకర్తకి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానని ప్రచారం కోసం సాయం అందించిన 20 లక్షల మంది అమెరికన్ ప్రజలకి కృతజ్ఞతలు తెలిపారు. 2016 లో సైతం బెర్నీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ తో పోటీపడ్డారు కాని అన్యూహ్యంగా ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు జో బిడెన్ బెర్నీ కంటే పై చేయి సాధించడంతో పక్కకి తప్పుకోక తప్పలేదు.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CORONAVIRUS' target='_blank' title='coronavirus-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>coronavirus</a> plan, explained - Vox

బెర్నీ , బిడెన్ ఇద్దరిలో అమెరికా ప్రజలు దాదాపు బిడెన్ వైపే మొగ్గు చూపారు. అంతేకాదు గతంలో బిడెన్ కి అమెరికా ఉపాధ్యక్షుడిగా చేసిన అనుభవం ఉండటంతో పాటు అమెరికా వ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నారు బిడెన్. అయితే ప్రస్తుతం అమెరికాలో కరోనా విజ్రుంభిస్తున్న నేపధ్యంలో అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు నిపుణులు.బెర్నీ ఈ పోరు నుంచీ తప్పుకోడంతో ఇక రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ ట్రంప్ తో తలపడటం ఖరారయ్యిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: