అగ్ర రాజ్యంలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిపుణుల అంచనాలను సైతం మించి మరీ కరోనా కేసులు రోజు రోజుకు ఉదృతం అవుతున్నాయి. ప్రపంచంలో కెల్లా కరోనా కేసులు అత్యధికంగా నమోదైన దేశంగా అమెరికా రికార్డ్ సృష్టించగా తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. అమెరికాలో కరోనా కేసులు మొదలైన రోజు నుంచి ఇప్పటి వరకూ  కరోనా కేసులు అత్యధికంగా నమోదు కాలేదని కానీ తాజాగా నమోదైన కేసుల సంఖ్య చూస్తే నోళ్ళు వెళ్ళబెట్టక తప్పదని అంటున్నారు పరిశీలకులు..గడిచిన 24గంటల్లో

అమెరికాలో మొత్తం 2.77 లక్షల మంది కరోనా వైరస్ బారిన పడ్డారని , ప్రపంచంలో ఏ దేశంలో కూడా  ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదని తెలుస్తోంది. ఇదిలాఉంటే ఇప్పటి వరకూ కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3.60 లక్షలకు చేరుకోగా, కరోనా కేసుల సంఖ్య 21 కోట్లకు చేరువలో ఉంది. అయితే కేవలం 24 గంటల్లో సుమారు 2. 77 లక్షల మంది కరోన బారినపడటం తో అమెరికా ఒక్క సారిగా ఉలిక్కి పడింది. ఒక్క సారిగా కరోనా కేసులు పెరిగిపోవడంపై నిపుణులు పలు రకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం  అమెరికా అంటువ్యాధుల నిపుణుడు, ఆంటోని పౌచీ క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ వస్తున్నాయని ప్రజలు బయటకి రాకుండా సామాజిక దారం  పాటించాలని చెప్పినా అమెరికన్స్ విచ్చల విడిగా తిరగడంతోనే కరోనా కేసులు సంఖ్య పెరిగిపోయిందని పరిస్థితి ఇలానే కొనసాగితే భావిష్యత్తులో మరిన్ని మరణాలు నమోదు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనాని నిపుణులు ఆవేదన చెందుతున్నారు. మరో వైపు ప్రభుత్వం రెండు రకాల వ్యాక్సిన్  లు అందుబాటులోకి తెచ్చినా ప్రజలు మాత్రం వ్యాక్సినేషన్ వేసుకోకపోవడం మరొక కారణమైతే, నిపుణ హెచ్చరికలు పక్కన పెట్టిమరీ మాస్క్ లు లేకుండా తిరగడం, దూర ప్రయాణాలు చేయడం కారణంగా  మరిన్ని కేసులు పెరిగిపోయాయని అంటున్నారు వైద్య నిపుణులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: