ఎన్ఆర్ఐలు ఎవరి వెంట ఉన్నారు?
కేసీఆర్ వెంట ఉన్నారా?
కేటీఆర్ వెంట ఉన్నారా? లేక మాజీ
మంత్రి ఈటల వెంట ఉన్నారా? అనే ప్రశ్నలు గత కొద్ది రోజులుగా తలెత్తుతున్నాయి. అయితే ఈ ప్రశ్నలకు
కేటీఆర్,
కేసీఆర్,
ఈటల రాజేందర్ నుంచి సమాధానాలు వస్తున్నాయి కానీ ఏది నిజం అనేది సామాన్య ప్రజానీకానికి తెలియడం లేదు. ఈ క్రమంలోనే కొందరు సీనియర్ జర్నలిస్టులు కొన్ని విస్తుపోయే విషయాలను బయటపెట్టారు. అవేంటో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
"మీరు పోరాటం చేయండి మీ వెంట మేము ఉంటాము. మీకు మేము సంఘీభావం తెలుపుతున్నాము. స్వర్గమైన, నరకమైన మేము మీవెంటే ఉంటాము అని వాగ్దానం చేస్తున్నాము" అని ఎన్ఆర్ఐలు జూమ్ మీటింగ్ లో
ఈటల రాజేందర్ తో చెప్పారని ఒక సీనియర్ జర్నలిస్ట్ వెల్లడించారు.
కానీ
టీఆర్ఎస్ అధిష్టానం వెంటనే ఒక ప్రకటన విడుదల చేయించి ఎన్ఆర్ఐలు తమ వెంటే ఉన్నారని చెప్పించింది.
కేటీఆర్ అమెరికా కి వెళ్లి వచ్చారు.. ప్రవాసులతో
కేటీఆర్ కి మంచి అనుబంధం ఉంది. అందువల్ల వారంతా కూడా
కేటీఆర్ తోనే ఉన్నారు అని
టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.
అయితే ఈ ప్రకటన చేసినట్లు
కేటీఆర్ వెంట నిజంగానే ఎన్ఆర్ఐలు ఉన్నారు కానీ వారు ప్రవాసులు కాదట.
కేసీఆర్ కి మద్దతు ఇచ్చేవారు ఎన్ఆర్ఐలు.. అంటే నాన్ రిలయబుల్ ఇండియన్స్ అనగా విశ్వసించదగని భారతీయులు అట. ఈ టైపు ఎన్ఆర్ఐలు అంతా కూడా స్వప్రయోజనాలు పొందడానికి ఎవరికైనా మద్దతు తెలపడానికి ముందుకు వస్తారట.
ఐతే
ఈటల రాజేందర్ తో ఉన్న ఎన్నారైలు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అనగా ఇతర దేశాలలో నివసించే భారతీయులు... అసలైన
తెలంగాణ ప్రవాసులు. అసలైన ఎన్నారైలు అంతా కూడా
కేసీఆర్ ఒక
ట్రంప్ అని.. ఏడేళ్ళు
సెక్రటేరియట్ కి, బీఆర్కే భవన్ కి,
ప్రగతి భవానికి సైతం వెళ్లకుండా ఉండే
కేసీఆర్ ప్రజాధనం వృధా చేస్తున్నారని.. అటువంటి నేత వెంట తాము అసలు ఉండబోవని ఎన్నారైలు
ఈటల రాజేందర్ తో జూమ్ మీటింగ్ లో స్పష్టం చేశారని ప్రముఖ జర్నలిస్టులు ఘంటాపథంగా చెబుతున్నారు.