ఇప్పటికే ప్రపంచ దేశాలు రెండు దశల ప్రజల కరోనా వైరస్ తో అల్లాడి పోయాయి. ఇక ఎన్నో దేశాలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాయ్. ఆ తర్వాత కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు రావడంతో ఇప్పుడిప్పుడే వైరస్ ప్రభావం తగ్గుతుంది. ఇలాంటి సమయంలోనే సౌతాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఓమిక్రాన్ వేరియంట్లు ప్రపంచదేశాలను భయపెడుతున్నాయి. చాప కింద నీరులా ఓమిక్రాన్ ప్రపంచ దేశాలకు పాకి పోతూ అందరిలో ప్రాణ భయానికి పెంచుతుంది. అయితే ఒక వైపు ఓమిక్రాన్  కేసులు పెరిగి పోతూ ఉంటే మరోవైపు కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరిగి పోతూ ఉండటం మాత్రం ఆందోళనకరంగా  మారిపోతుంది. ముఖ్యంగా అగ్రరాజ్యాలు గా కొనసాగుతున్న బ్రిటన్ అమెరికా లాంటి దేశాల్లో ప్రతి రోజూ లక్షల్లో కేసులు వెలుగు లోకి వస్తూ ఉండటంతో ఆందోళనకర పరిస్థితులు వస్తున్నాయి.



 ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏ క్షణం లో వైరస్ బారిన పడాల్సి వస్తోందో అని ఈ రెండు దేశాల్లో ప్రజలు భయాందోళన లోనే బతుకును వెళ్లదీస్తున్నారు. ఇటీవలే అమెరికాలో ప్రతి రోజూ ఆరు లక్షలకు పైగా కేసులు వెలుగు లోకి వస్తూ ఉండగా బ్రిటన్ లో కూడా లక్షల్లోనే కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వైద్య సదుపాయాల్లో ప్రపంచ దేశాలలో మేము నెంబర్ వన్ అని చెప్పుకుంటూ ఉంటాయ్ బ్రిటన్ అమెరికా లాంటి దేశాలు. అంటే ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకి బ్రిటన్లో ఊహించని సమస్యలు వచ్చి పడుతున్నాయి అన్నది అర్ధమవుతుంది.  వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో.. కనీసం  హాస్పిటల్స్ సరిపోని పరిస్థితి ఏర్పడిందట.



ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏకంగా సైన్యం లో ఉండే డాక్టర్లను ఇప్పుడు రంగంలోకి దించినట్లు తెలుస్తోంది . ఆర్మీ లో సైనికులకు వైద్యం చేసే డాక్టర్లు అందరిని కూడా అత్యవసరం కింద ప్రస్తుతం దేశంలో కి రప్పిస్తుందట బ్రిటన్ ప్రభుత్వం.  ఇలా సైన్యం లో ఉన్న  డాక్టర్లతో పాటు నర్సింగ్ సిబ్బందిని కూడా రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోవడం కాదు.. అటు ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది కొరత కారణంగా బ్రిటన్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: