అయితే బుధవారం ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసే అవకాశం ఉంది అని ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించాడు. అంతే కాకుండా అటు అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. దీంతో సరిహద్దు లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్న దానిపై అందరి దృష్టి ఉంది. ఇలా ఇక ఇలాంటి ఉత్కంఠభరితమైన పరిస్థితుల నడుమ సరిహద్దుల్లో ఒక అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ సరిహద్దులోని కొన్ని రష్యన్ దళాలు వెనక్కి వచ్చాయ్. ఈ విషయాన్ని రష్యా అధికారికంగా వెల్లడించింది.
రష్యా దళాలు ఇలా వెనక్కి రావడం వెనుక ఏదైనా వ్యూహం దాగి ఉందా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే సరిహద్దుల్లో యుద్ధ విన్యాసాలు ముగిసాయని.. అందుకే కొంత మంది సైన్యాన్ని వెనక్కి రప్పించాము అంటూ వివరణ ఇచ్చింది రష్యా. అయితే ఇటీవలే ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న బేస్ లకు రష్యా సైన్యాన్ని భారీ మొత్తంలో రప్పించింది. అయితే ఎంత మేరకు సైన్యాన్ని వెనక్కు పంపించింది అన్నది మాత్రం ఆసక్తికరం గా మారిపోయింది. ఇక మరోవైపు ఇటీవలే అటు జపాన్ రష్యా మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా రష్యా వెనక్కి తగ్గిందా అన్న చర్చ కూడా మొదలైంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి