
అగ్రరాజ్యమైన రష్యాను ధీటుగా ఎదుర్కునేందుకు ఉక్రెయిన్ సేనలు వీరోచితంగా పోరాటం చేస్తూ ఉన్నాయి. అదే సమయంలో అటు రోజురోజుకు రష్యా మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా అంతకంతకూ మరింత ఎక్కువగానే ఉక్రెయిన్ పై దాడులతో విరుచుకుపడుతూ ఉండడం గమనార్హం. ఇటీవల కాలంలో ఏకంగా బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాన్ని కూడా మొదలు పెట్టింది రష్యా. ఇలాంటి నేపథ్యం లోనే రష్యా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రపంచ దేశాలు ప్రస్తుతం తీరు మార్చుకోవాలి అంటూ రష్యా పై విమర్శలు చేయడం చేస్తున్నాయి. కొన్ని దేశాలు ఒక ఆర్థిక ఆంక్షలు కూడా వినిపిస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇటీవలే స్విట్జర్లాండ్ కు ఒక విజ్ఞప్తి చేశాడు. రష్యన్ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయాలంటూ స్విజర్లాండ్ ప్రభుత్వాన్ని కోరాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు. రష్యా దాడులను నిరసిస్తూ స్విట్జర్లాండ్ లో నిరసన తెలుపుతున్న వేలాదిమందిని ఉద్దేశించి జెలెన్ స్కీ ఇటీవలే మాట్లాడారు. ఈ యుద్ధానికి దారి తీసిన వారిని నిధులు స్విట్జర్లాండ్ లో ఉన్న బ్యాంకులో ఉన్నాయని.. ఇక వారి నిధులను స్తంభింప చేస్తే వారి అధికారం కూడా తగ్గించే అవకాశం ఉంటుంది అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీనిపై స్విజర్లాండ్ ఎలా స్పందిస్తుందో అన్నది చూడాలి..