ప్రపంచ వినాశనానికి కరోనా వైరస్ పేరుతో చైనా చేసిన కుట్ర ఇక ఇప్పుడు బెడిసికొట్టింది. ప్రపంచ దేశాలలో సంక్షోభం సృష్టించాలనుకున్న చైనాకు ఇక ఇప్పుడు అదే సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి వస్తుంది. ఇదివరకు ప్రపంచదేశాలను వణికించిన కరోనా వైరస్ ఇక ఇప్పుడు పుట్టినిల్లు చైనా పై ప్రేమ చూపిస్తుంది. దీంతో క్రమక్రమంగా కరోనా వైరస్ కేసులు సంఖ్య పెరిగి పోతూ చైనాలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ కఠిన నిబంధనలు విధిస్తున్న  కేసులు సంఖ్య మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పాలి.


 ముఖ్యంగా చైనాలో అతిపెద్ద నగరం గా కొనసాగుతున్న షాంఘైలో వైరస్ ఉద్ధృతి విపరీతంగా పెరిగిపోతోంది. దేశం మొత్తంలో నమోదవుతున్న కొత్త కేసులలో 70 శాతం కేసులు కేవలం షాంఘైలో  నగరంలోనే వెలుగులోకి వస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక పరిస్థితులు రానున్న రోజుల్లో ఇలాగే కొనసాగితే తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని చైనా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన చైనా ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది అని తెలుస్తోంది. షాంఘైలో నగరంలో వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలకు ఉపక్రమించింది.  వైరస్ పరీక్షలను పెంచడంతోపాటు పెద్దఎత్తున ఆరోగ్య కార్యకర్తలు సైన్యాన్ని కూడా రంగంలోకి దింపేందుకు సిద్ధమైంది చైనా ప్రభుత్వం.



 ఇలా కరోనా వైరస్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రస్తుతం చైనా ప్రభుత్వం సిద్ధమైంది అనేది తెలుస్తుంది. ఇటీవలే చైనా దేశ వ్యాప్తంగా 13 వేలకు పైగా కేసులు నమోదు కాగా 9 వేల కేసులు షాంఘై నగరంలోని వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇక నగర వ్యాప్తంగా దాదాపు అన్ని రకాల కార్యకలాపాలను నిలిపి వేసి లాక్డౌన్ విధించింది. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. కానీ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ఆర్మీ నేవీ నుంచి దాదాపు 2000 మంది కి పైగా సైన్యాన్ని ఇక షాంఘైలో నగరం లోకి దింపింది అన్నది తెలుస్తుంది. ఆరోగ్య కార్యకర్తలు వైద్య సిబ్బంది కూడా షాంఘైలో నగరంలో పని చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: