సాధారణంగా రైతులు అన్న తర్వాత ఎప్పుడు ఏదో రకమైన పంట వేస్తూ ఉంటారు. ఇక ప్రతి రోజూ ఉదయాన్నే పంట పొలానికి వెళ్లి నీరు సాగు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఓ రైతు కూడా ఎప్పటిలాగానే  పొలానికి  వెళ్లి అక్కడ పనులు చక్కబెట్టడానికి ప్రయత్నించాడు. అయితే వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన వ్యక్తికి ఒక వింతైన వస్తూ కనిపించింది. దీంతో ఇది చూసి ఒక్కసారిగా ఖంగు తిన్నాడు. ఎప్పుడూ లేనిది పొలంలో ఏదో ఎత్తయిన నలుపు రంగులో ఉన్న వస్తువు నిటారుగా నిలబెట్టి ఉంది. దీంతో అదేమిటో అతనికి అర్థం కాలేదు.


 ఈ క్రమంలోనే ఏమై ఉంటుందా అని మరింత దగ్గరికి వెళ్లి గమనించాడు. ఈ క్రమంలోనే అది ఒక శకలం అని గుర్తించాడు సదరు రైతు. ఈ విషయం అర్ధమైన తర్వాత ఆ రైతు మనసులో మరి కొన్ని ఆలోచనలు కూడా వచ్చాయి.. అది అక్కడ పడిందా లేకపోతే ఎవరైనా తీసుకోవచ్చి వదిలేసి వెళ్లారా అని అతనికి అర్థం కాలేదు. దీంతో వెంటనే అధికారులకు సమాచారం అందించాడు ఆ రైతు. ఇక హుటిన అక్కడికి చేరుకున్న అధికారులు ఆ గ్రహశకలం ని పరిశీలించి చూసి స్ఫేస్ ఎక్స్ క్యాప్సూల్ అన్న విషయాన్ని నిర్ధారించారు.


 అయితే ఈ గ్రహ శకలం సుమారు మూడు మీటర్ల పొడవు 20 నుంచి 30 కిలోల మధ్య బరువు ఉంటుంది అంటూ అధికారులు తెలిపారు.. అయితే నేరుగా అంతరిక్షం నుంచి ఆ రైతు పొలంలో పడినట్లుగా అధికారులు నిర్ధారించారు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమీపంలోని గ్రామీణ ప్రాంతంలో నివాసముంటున్నారు నిక్ మైనర్స్. ఇటీవలే ఆయన పొలంలో గ్రహశకలం కనిపించడం సంచలనం గా మారిపోయింది. అయితే ఇలాంటి శిథిలాలు వ్యర్థాలు ఎక్కువగా సముద్రంలో పడతాయని భూమిపై అరుదుగా మాత్రమే వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఆ రైతు పొలానికి సమీపంలోనే మరో రెండు శిధిలాలు కూడా లభ్యమయ్యాయ్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: