ఇటీవల కాలంలో అపురూపమైన వస్తువులను వేలం వేయడం లాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఏళ్ల చరిత్ర కలిగిన వస్తువులను కొనుగోలు చేసి తమ దగ్గర పెట్టుకోవడానికి ఎంతో మంది ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇక ఇలా అపురూపమైన వస్తువులను వేలం వేసిన సమయంలో లక్షలు దార పోసి మరి ఏకంగా ఆ వస్తువులను వేలం పాటలో సొంతం చేసుకుంటూ ఉండడం గమనార్హం. ఇలా ఏళ్ల చరిత్ర కలిగిన చిన్న చిన్న వస్తువులను సొంతం చేసుకోవడానికి లక్షలు దారపోస్తూ ఉండడం అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటుంది.


 అయితే ఇప్పుడు వరకు కేవలం అపురూపమైన వస్తువులను మాత్రమే అందరూ వేలంపాటలో దక్కించుకోవడం చూసాము. కానీ ఏకంగా ఒక కేకు ముక్క కోసం ఎవరైనా వేలం పాటలో పోటీ పడటం చూసారా. కేకుముక్కు కోసం వేలంపాట నిర్వహించడం ఏంటి.. ఒకసారి కేక్ తీసుకు వచ్చిన తర్వాత మహా అయితే ఒక వారం రోజులు బాగుంటుంది. ఆ తరవాత ఎలాగో పాడవుతుంది కదా. దానికోసం వేలంపాట ఎందుకు నిర్వహిస్తారు అనే డౌట్ అందరి మదిలో మెదిలే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా కేకు ముక్కకి వేలం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఆ కేకు మొక్కకు ఎన్నేళ్ల చరిత్ర ఉందో తెలుసా.. ఏకంగా 41 ఏళ్ళ నాటి కేకుముక్కకు వేలం నిర్వహించబోతున్నారు. ఇంతకీ ఆ కేకు ముక్కకు స్పెషాలిటీ ఏమిటంటే.. బ్రిటన్ కింగ్ చార్లెస్- రాణి డయానా పెళ్లినాటి కేక్ ముక్క కావడం గమనార్హం. ఇక ఈ కేక్ ముక్కను దక్కించుకోవడానికి ఎవరూ రారు అనుకుంటే మాత్రం పొరపాటే.. ఎందుకంటే ఎంతోమంది ఔత్సాహికులు కేకుముక్కను దక్కించుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంగ్లాండుకు చెందిన డోరే అండ్ రీస్ ఆక్షన్ అనే సంస్థ కేకు ముక్కను వేలం వేసేందుకు సిద్ధమైంది. 1981లో జరిగిన కింగ్ చార్లెస్- ప్రిన్సెస్ డయానాల పెళ్ళికి ప్రపంచ దేశాల నుంచి 3,000 మంది అతిథులు హాజరయ్యారు. ఇక ఈ 41 ఏళ్ళ నాటి కేకు ముక్కకు ధర ఎంత నిర్ణయిస్తారు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: