గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు సంపాదించుకుని ప్రపంచ రికార్డు సాధించాలి అంటే అంత సులభమైన విషయం కాదు. ప్రపంచంలో ఉన్న అందరికంటే మనలో ప్రత్యేకమైన టాలెంట్ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోవాలని కొంతమంది చేసే విన్యాసాలు చూస్తూ ఉంటే వరల్డ్ రికార్డ్ సాధించాలంటే ఇంత కష్టమా అనే భావన ప్రతి ఒక్కరిలో కలిగేది. కానీ ఇటీవల కాలంలో గిన్నిస్ రికార్డు సృష్టిస్తున్న వారిని చూస్తే మాత్రం ఇంత సింపుల్గా వరల్డ్ రికార్డు సృష్టించవచ్చా అని అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి.


 ఒకప్పటిలాగా ఎంతో కఠినమైన విన్యాసాలు చేసి ఇక గిన్నిస్ బుక్ రికార్డు సాధించాలని ఎవరు అనుకోవట్లేదు. రోజు చేసే పనినే కాస్త కొత్తగా ట్రై చేసి ఇక వరల్డ్ రికార్డు సృష్టిస్తున్న వారే  నేటి రోజుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారూ అని చెప్పాలి. అయితే కేవలం మనుషులే కాదు అటు జంతువులు కూడా చిన్నచిన్న కారణాలతోనే ఇలా వరల్డ్ రికార్డు సాధిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక కుక్క గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఇంతకీ గిన్నిస్ బుక్ లో రికార్డు కోసం ఆ కుక్క ఏం చేసిందో తెలుసా.. ఏమి చేయలేదు.


 అదేంటి ఏం చేయకుండానే గిన్నిస్ బుక్ లో చోటు దక్కుతుందా అనే అనుమానం కలుగుతుంది కదా. అయితే కుక్క ఏం చేయలేదు కానీ.. ఆ కుక్కకు ఉన్న నాలుక కారణంగా గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించింది. యూఎస్ లోని లూసీయానాకు చెందిన జోయి అనే కుక్క ఇలా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం జీవించి ఉన్న శునకాల్లో అతి పొడవైన నాలుక 12.7 సెంటీమీటర్లు కలిగి ఉంది ఈ శునకం. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. అంతకుముందు బిస్బి అనే శునకం పేరు మీద ఈ రికార్డు ఉండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: