సాధారణంగా వర్షం అనేది ఎలా కురుస్తుందో అందరికీ తెలిసే ఉంటుంది.. వర్షం కురవడం గురించి తెలవకపోవడం ఏంటి బాసు.. పుట్టినప్పటినుంచి చూస్తూనే ఉన్నాం కదా.. సముద్రంలో ఉన్న నీరు ఆవిరై ఇక మేఘాలుగా ఏర్పడతాయి. ఇక ఆ మేఘాల నుంచి వర్షం కురుస్తూ ఉంటుంది అన్న విషయం అందరికీ తెలుసు.. ఇక దీని గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అని అంటారా.. అయితే ఇప్పటివరకు కేవలం నీళ్లు మాత్రమే వర్షం రూపంలో కురుస్తుంది అనే విషయం అందరికీ తెలుసు.


 అవును అది కూడా నిజమే కదా. నీళ్లు కాకపోతే వర్షం రూపంలో రాళ్లు పడతాయా అంటారు ఎవరైనా.. కానీ ఇక్కడ మాత్రం నీటి వర్షం కురవదు. ఏకంగా ఇసుక వర్షం కురుస్తుంది. ఈ విషయం గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. అదేంటి ఇసుక వర్షం కురవడమా.. జీవితంలో ఇలాంటి మాట ఇప్పటివరకు వినలేదు. ఇలా ఇసుక వర్షం కురిసే ప్రాంతం ఎక్కడుంది అంటారా.. అయితే ఇలా ఇసుక వర్షం కురిసేది మన గ్రహంలో కాదు మరో గ్రహంలో. వినడానికి కాస్త ఆసక్తికరంగా మరింత విచిత్రంగా అనిపిస్తుంది కదా. భూమికి 200 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ గ్రహంలో ఇలా ఇసుక వర్షం కురుస్తుందట.


WASp-107b అనే గ్రహం లో మాత్రం నీటికి బదులు ఏకంగా మేఘాలు ఇసుకతో ఏర్పడతాయట. ఈ విషయాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా పరిశోధకులు కనుగొన్నారు. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ గ్రహ పరిణామం జుపిటర్ స్థాయిలో ఉంటే.. ద్రవ్యరాశి నెప్ట్యూన్ మాదిరి ఉంటుందట. దీంతో నీటి తరహాలోనే ఇక్కడ ఇసుక మేఘాలు ఏర్పడతాయట. ఇసుక మొత్తం మేఘాలలోకి చేరి మళ్ళీ వర్షం కురిసినట్లుగానే మేఘాలలో నుంచి ఇసుక ఉపరితలంపై పడుతుందట. ఏదేమైనా ఇసుక వర్షం కురిసే గ్రహం అంటే కాస్త విచిత్రంగానే ఉంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: