ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ప్రజాస్వామ్య పాలన సాగుతుంది. ఒకప్పటి రాజులు రాజరికాలు నియంత పాలనలో ఎక్కడ కనిపించడం లేదు. అయితే నేటి ప్రజాస్వామ్య ప్రపంచంలో కూడా ఇంకా నియంత పాలన సాగే దేశం ఏదైనా దేశంలో ఉందా అంటే ఉత్తరకొరియా ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఏకంగా దశాబ్దాల నుంచి ఉత్తర కొరియాలో కిమ్ కుటుంబ సభ్యులు పాలన సాగిస్తున్నారు.


 అయితే నేటి జనరేషన్ పిల్లలకు నియంత అనే విషయాన్ని పుస్తకాల్లో చదువుకోవడం మాత్రమే తెలుసు. కానీ కిమ్ పాలన గురించి తెలిసిన తర్వాత నియంత పాలన అంటే ఇలాగే ఉంటుందేమో అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది.  ఎందుకంటే ఇక తమ దేశంలో బ్రతుకుతుంది ప్రజలు కాదు ఏకంగా కాళ్ల కింద బ్రతికే బానిసలు అన్నట్లుగా కిమ్ వ్యవహరిస్తూ ఉంటాడు. కఠినమైన నిబంధనలు విధిస్తూ బ్రతకడం కంటే చావడమే మేలు అనే పరిస్థితిని తీసుకువస్తూ ఉంటాడు కిమ్. ఈ క్రమంలోనే ఎవరైనా ఎదురు తిరిగితే వారిని దారుణంగా కాల్చి చంపడం లాంటివి చేస్తూ ఉంటారు.


 అయితే కొంతమంది ఇలా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ పెట్టే రూల్స్ తట్టుకోలేక చివరికి దక్షిణ కొరియాకు పారిపోవడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా పారిపోయిన వారు మళ్ళి ఉత్తర కొరియాలో ఉండిపోయిన వారి కుటుంబ సభ్యుల కోసం డబ్బు కూడా పంపలేరు. దీనిపై నిషేధం కొనసాగుతూ ఉంటుంది. అయితే గత కొంతకాలం నుంచి ఉత్తర కొరియాల్లో ఆహార సంక్షోభం ఏర్పడింది. అయినప్పటికీ ఈ విషయాన్ని కిమ్ పట్టించుకోవట్లేదు. దీంతో అక్కడి ప్రజలందరూ కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే చివరికి  డబ్బులు లేక ఆహారం దొరక్క అక్కడి ప్రజలు గడ్డి తింటున్నారట. తద్వారా కాళ్లు చేతులు వాచిపోతున్నాయని అక్కడి ప్రజలు వాపోతున్నారని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kim