అదృష్టం ఉండాలే కానీ లక్ష్మీదేవి కటాక్షం ఏదో రూపంలో లభిస్తూనే ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే అదృష్ట లక్ష్మి వరించి కోటీశ్వరులుగా మారాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే లక్ష్మీదేవికి తెగ పూజలు చేస్తూ ఉంటారు. అదేదో రవితేజ హీరోగా నటించిన సినిమాలో ఆలీ లక్ష్మీదేవిని పూజించినట్లుగానే.. కొంతమంది ఏకంగా అదృష్టం వరించాలని గట్టిగానే పూజలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఎవరు ఎన్ని పూజలు చేసిన ఎవరికి ఎప్పుడు అదృష్టం వరించాలో ముందు రాసిపెట్టే ఉంటుందేమో అన్న విధంగా కొన్ని కొన్ని ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉంటాయి.


 ఎందుకంటే ఎంతోమంది ఇక తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లాటరీల రూపంలో తరచు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు  ఇంకొంతమంది ఏకంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి కోటీశ్వరులుగా మారాలని అనుకుంటూ ఉంటారు. అయితే కొంతమందికి అయితే ఊహించని రీతిలో అదృష్టం వరిస్తూ ఉంటుంది. ఏకంగా లాటరీ తగిలి రాత్రికి రాత్రికి కోటీశ్వరులుగా మారిపోవడం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పటివరకు ఇలా ఎంతోమంది లాటరీ గెలుచుకున్న సంఘటనలకు సంబంధించిన వార్తలు వైరల్ గా మారిపోయాయి.  కొంతమంది 10 కోట్లు ఇంకొంత మంది 50 కోట్లు ఇలా గెలుచుకున్నారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఒంటినిండా రక్తం కాదు అదృష్టమే ఉందేమో అన్న రీతిలో జాక్పాట్ కొట్టేశాడు. ఏకంగా లాటరీ ద్వారా 795 కోట్లు గెలుచుకున్నాడు. చైనాకు చెందిన ఒక 28 ఏళ్ల యువకుడికి జాక్పాట్ తగిలింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 795 కోట్ల రూపాయలు లాటరీ గెలుచుకున్నాడు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. ఇది ఆ దేశ చరిత్రలోనే అత్యధికం అన్నది తెలుస్తోంది. అయితే లబ్ధిదారుడు ప్రావిన్స్ లో చిన్న వ్యాపారం చేసుకుంటాడని సమాచారం. ఈనెల 7న తనకు కావాల్సిన డబ్బులు అతను తీసుకున్నాడని.. అయితే లాటరీ  వచ్చిన ఆనందంలో  కనీసం రాత్రంతా నిద్ర కూడా పోలేదని ఆ యువకుడు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: