భారత్, చైనా లాంటి దేశాలలో రోజురోజుకి జనాభా పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా జనాభా పెరిగిపోకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతున్నారు ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దు అనే నినాదంతో ముందుకు సాగుతూ ఉంది ప్రభుత్వం. దీంతో ఇటీవల కాలంలో ప్రభుత్వం అవగాహన కల్పించినట్లుగానే పిల్లల విషయంలో ఎంతోమంది ఇక తమ ఆలోచన తీరును మార్చుకుంటున్నారు. ఒకప్పటిలా ముగ్గురు నలుగురు పిల్లలని కాకుండా కేవలం ఇద్దరితో సరిపెట్టుకుంటూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే.


 అయితే మన దేశంలో పరిస్థితి ఇలా ఉంటే ఇతర దేశాలలో మాత్రం జనాల రేటు అంతకంతకు తగ్గిపోతూ ఉంది. ఈ క్రమంలోనే పిల్లలను కనండి మహాప్రభో అని అక్కడి ప్రభుత్వాలు వేడుకుంటున్న కూడా అక్కడి ప్రజలు మాత్రం పిల్లలను కనెందుకు ముందుకు రాకపోవడం లేదు. దీంతో ఆయా దేశాలలో జననాల రేటు తగ్గిపోతుంది. సో అక్కడి ప్రభుత్వాలు ఆందోళనలో మునిగిపోతున్నాయ్. ఇప్పటికే జపాన్ దేశంలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఏకంగా పిల్లలను కనేందుకు భారీగా నజరానాలు కూడా ప్రకటిస్తుంది అక్కడి ప్రభుత్వం. ఇక ఇప్పుడు సౌత్ కొరియాలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది తెలుస్తుంది.


 ఏకంగా జననాల రేటు అక్కడ రికార్డు స్థాయిలో తగ్గిపోతుంది. 2023లో కనిష్ట జననాల రేటు  నమోదయింది అని చెప్పాలి. దక్షిణ కొరియాలో ఒక మహిళకు జీవిత కాలంలో పుట్టే సగటు పిల్లల సంఖ్య 2022లో 0.78 గా ఉండగా 2023లో 8% తగ్గింది దీంతో 0.72 గా మారిపోయింది. ఇదే కొనసాగితే ఇక ఇప్పుడు సౌత్ కొరియాలో 56 మిలియన్లుగా ఉన్న జనాభా సంఖ్య 2100 సంవత్సరానికి గాను 25.8 మిలియన్లకు తగ్గిపోయే అవకాశం ఉందని అక్కడ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే జననాల రేటును పెంచేందుకు అక్కడ పిల్లలని కనే వారికి అద్భుతమైన స్కీమ్స్  అందుబాటులోకి తీసుకొచ్చిన  పరిస్థితిలో మార్పు రాకపోవడంతో.. అక్కడి ప్రభుత్వం ఆందోళనలో మునిగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri