ప్రతి మనిషికి నిద్ర అనేది ఎంతో ముఖ్యం అన్న విషయం తెలిసిందే. ఇక సరైన నిద్ర ఉన్నప్పుడే ఇక మనిషి ఆరోగ్యంగా ఉండగలడు అని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. ప్రతిరోజు 6 నుంచి 8 గంటల పాటు తప్పకుండా నిద్రపోవాలి అని సూచిస్తూ ఉంటారు. అయితే నేటి రోజుల్లో జనాలు ఇవన్నీ పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే కొంతమంది మాత్రం 6 నుంచి 8 గంటలు కాదు ఏకంగా 10 గంటలకు పైగానే నిద్రపోవడం అలవాటుగా మార్చుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే అతి నిద్ర కూడా ఆరోగ్యానికి చేటు అని నిపుణులు చెబుతూ ఉంటారు.


అది సరేగాని ఇప్పుడు నిద్ర గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అనుకుంటున్నారు కదా.. సాదరణంగా ఎవరైనాఎన్ని గంటలు నిద్రపోతారు అంటే.. మహా అయితే ఎనిమిది నుంచి పదిలపాటు నిద్రపోతారు అని  ఆన్సర్ ఇస్తారా ఎవరైనా. కానీ ఇక్కడ మాత్రం  ఏకంగా ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా నెలల పాటు నిద్రపోతారట. కొన్ని నెలల పాటు నిద్రపోవడమేంటి.. అలా ఎలా నిద్ర పడుతుంది అని అనుకుంటున్నారు కదా. ఇది మనదేశంలో కాదు కజకిస్తాన్ లో. అక్కడ కలచి అనే గ్రామం ఉంది. అక్కడి ప్రజలు ఏకంగా నెలల పాటు నిద్రిస్తున్నారట. ఇక్కడ నిద్రపోయిన ఒక వ్యక్తి దాదాపు నెలరోజుల పాటు నిద్ర లేవడట.


 ఈ ఊరిని స్లీపి హోల్ అని అంటూ ఉంటారట అక్కడ జనాలు. అయితే ఇలా ఒక్కసారి నిద్రలోకి జారుకున్న వ్యక్తి ఏకంగా వారి దగ్గర బాంబు పేల్చిన మెలకువలోకి రాడట. అయితే ఇలా నిద్రపోవాలని అక్కడున్న వారు ఎవరు కూడా అనుకోరట. కొన్ని కొన్ని సార్లు ఇలా నెలలపాటు నిద్రపోవడం వల్ల ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారట. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఏకంగా రోడ్డుపైన నిద్రలోకి జారుకోవడం చేస్తూ ఉంటారట. ఇక నెలరోజుల పాటు అక్కడ నిద్రపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ గ్రామంలో సుమారు 600 మంది జనాభా ఉంటే.. 14% మంది ఇలాంటి వ్యాధితోనే బాధపడుతున్నారట. 2010లో ఒక పాఠశాలలో జరిగిన సంఘటన వల్ల దీనికి సంబంధించిన విషయాలు బయట ప్రపంచానికి తెలుసాయట. ఏకంగా క్లాస్ రూమ్ లో విద్యార్థులు నిద్రపోయి నెల రోజుల వరకు లేవకపోవడంతో ఉపాధ్యాయులు చర్చించుకుంటూ ఉండగా.. ఆ నోట ఈ నోట పడి ఈ విషయం తెర మీదకి వచ్చిందట. అయితే దీని వెనుక కారణం ఏంటి అని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించిన కూడా ఫలితం లేకుండా పోయిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: