భారత దేశంలో రోజు రోజు కి రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కొన్ని అనుకోకుండా జరిగే ఘటనల వల్ల జరిగే ప్రమాదాలు కొన్ని. రోడు రవాణా సంస్థ ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా కూడా ఈ ప్రమాదాలను ఏమాత్రం అరికట్టలేక పోతున్నాయి. ఈ రోజు ఉదయం తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరునెల్వేలి సమీపంలో ఓమ్ని బస్సు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణీకుల్లో పది మంది అక్కడిక్కడే మృతి చెందారు.

వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ బస్సు పుదుచ్చేరి నుంచి కేరళలోని తిరువనంతపురం వెళ్తూండగా ఈ దుర్ఘటన జరిగింది. బస్ డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.

బస్ బోల్తా పడ్డ ప్రదేశంలో చెల్లా చెదురైన మృతదేహలు


చిదంబరం నుంచి ఈ బస్ నాగర్ కోయిల్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కేసు విచారిస్తున్నారు. తెల్లవారు జామున బస్ డ్రైవర్లు అవసరమైతే కొద్ది సేపు వాహనాలను నిలిపి విశ్రాంతి తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగవు.

మరింత సమాచారం తెలుసుకోండి: