దేశంలో ఎన్నో చోట్ల ప్రతిరోజు ఎందరో అమ్మాయిలపై అనేక రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. అయితే వీటన్నింటికీ ప్రధాన కారణం సినిమాలా..? అంటే అవుననే సమాధానమే విస్పష్టం. కారణం సినిమాల్లో ముఖ్యంగా బాలివుడ్ సినిమాల్లో అమ్మాయిలను మరీ సెక్సీ గా చూపెడుతుండడం వల్ల కొంత మంది అబాధ్యతాయుతమైన వ్యక్తులు వాటిపై విపరీతంగా ఆకర్షితమై బయట కనబడుతున్న మహిళల పై విచక్షణా రహితంగా దాడికి దిగుతున్నారు.



ముఖ్యంగా యవత తెరపై కనబడే సీన్లకు అమితంగా ఆకర్షితులై బయట మహిళల పట్ల కూడా అదే విధంగా ప్రవర్తించి కటకటాల పాలవుతున్నారు. సినిమాల్లో జరిగేదంతా కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి వారు చేసే నాటకం మాత్రమే. కాని బయట జరిగేవి మాత్రం నిజ జీవితం పై, కుటుంబం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. సరిగ్గా ఇదే నిజంగా జరుగుతుందని నమ్ముతున్నారు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ. అమ్మాయిల పట్ల జరుగుతున్న ఈవ్ టీజింగ్ కు బాలీవుడ్ బాధ్యత వహించాలని ఆమె అన్నారు.


Image result for cinema

మహిళలపై పెరుగుతున్న దాడులకు సినిమాలే కారణమని మండిపడ్డారు. దాదాపు అన్ని సినిమాల్లో ఈవ్ టీజింగ్ తోనే ప్రేమ మొదలవుతోందని... ప్రాంతీయ భాషా చిత్రాల్లో కూడా ఇదే ఒరవడి కొనసాగుతోందని విమర్శించారు. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం, తాకడం, వేధించడం, ఆ తర్వాత ప్రేమలో పడటం... అన్ని సినిమాల తీరు ఇలాగే ఉంటోందని అన్నారు. దీంతో, మహిళలపై వేధింపులకు, హింసకు పాల్పడవచ్చనే భావన పురుషుల్లో పెరుగుతోందని తెలిపారు. చేతకాని పురుషులే మహిళలపై హింసకు పాల్పడుతారని... పనిలో వైఫల్యం చెందే పురుషులే మహిళలపై అసహనాన్ని ప్రదర్శిస్తారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: