నవ భారాత్ లో యువత అభివృద్ధిలో దూసుకుపోతున్నా కొందరి మనస్తత్వాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. సినిమాల ప్రభావమో, పాశ్చాత్య నాగరికత ప్రభావమో తెలియదుగానీ దేశానికి దిశా నిర్దేశం చేయాల్సిన యువకులు ఎందరో తమ ప్రేమ విఫలం అయిందని తమ ప్రాణాలను బాలి చేసుకుంటున్నారు. కేవలం ప్రేమ కారణంగా తల్లి దండ్రులను, బంగారు భవిష్యత్తును, సన్నిహితులను వదిలి పరలోకానికి పయనం అవుతున్నారు. ఇలాంటి సంఘటనల పట్ల సామాజిక కార్యకర్తలు, మీడియా ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేసినా ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాం.


ముఖానికి కవర్‌ చుట్టుకుని ఆత్మహత్య

ప్రేమ విఫలం అయిందని ఓ యువకుడు తన ప్రాణాలనే బలిచేసుకున్న ఘటన నేడు కుకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ ఫోర్త్ ఫేస్ లో చోటుచేసుకుంది. ముఖానికి ప్లాస్లిక్ కవర్ చుట్టుకుని, ఆ తర్వాత కారులోని గ్యాస్ లీక్ చేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మలేషియా టౌన్ షిప్ సమీపంలో జరిగిన ఈ ఘటన... ఈ ఉదయం వెలుగు చూసింది. పార్క్‌ చేసి ఉన్న కారులో నుంచి దుర్వాసన వస్తుండటంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.



రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు నెల్లూరు జిల్లాకు చెందిన దినేష్‌గా గుర్తించిన పోలీసులు అతని వద్ద నుంచి సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్నారు.  మృతుడిని నెల్లూరు జిల్లాకు చెందిన దినేష్ గా గుర్తించారు. కారులో సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ విఫలం కావడం వల్లే అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: