గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ ఉగ్రమూకలకు అడ్డగా మారిపోయింది. భారత్  తో గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ సైనికులను ఉసిగోలుపుతూ..మరోవైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది.  తాజాగా పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ తన పదవికి రాజీనామా చేశారు. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను ప్రధాని పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది.
Sharif (C) is expected to vacate the Prime Minister's residence on Friday.
1990ల్లో షరీఫ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు లండన్‌లో భారీగా ఆస్తులు కూడగట్టారన్న ఆరోపణలపై జిట్‌ విచారణ చేపట్టింది. గతేడాది విడుదలైన పనామా పత్రాల్లో నవాజ్‌ షరీఫ్‌ పేరు రావడంతో... ఆస్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  షరీఫ్ పై క్రిమినల్ కేసును నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని పదవి నుంచి వెంటనే తప్పుకోవాలంటూ షరీఫ్ ను ఆదేశించింది.


తాను పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తే సోదరుడిని పాక్‌ ప్రధానిని చేసేందుకు నవాజ్‌ షరీఫ్‌ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు, పంజాబ్‌ ప్రావిన్స్‌ సీఎం షెహబాజ్‌ షరీఫ్‌తో పాటు రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ కూడా రేసులో ఉన్నారు



మరింత సమాచారం తెలుసుకోండి: