ఇన్నాళ్లూ మిత్రపక్షాలను ఏమాత్రం పట్టించుకోని బీజేపీ.. ఇప్పుడు ఎందుకు కాళ్ళబేరానికి వస్తోంది. వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలన్నీ ఏకమవబోతున్నాయనే సంకేతాలు వెలువడ్డం వల్లేనా..? అదే జరిగితే ఓటమి తప్పదనే భయమే బీజేపీని ఇప్పుడు మిత్రపక్షాలవైపు నడిపిస్తోందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఉపఎన్నికల ఫలితాలు బీజేపీకి గట్టి షాక్ ఇచ్చాయి. దీంతో మిత్రపక్షాలతో తీరుపై బిజేపీ తన పంథా మార్చుకుంటోంది. ఇప్పటి వరకు ఉన్న డోంట్ కేర్.. పాలసీకి టాటా చెప్పేసి.. కేర్ టేకింగ్ కి సిద్ధమైంది. దశాబ్దల నాటి శివసేన బంధం బద్దలయ్యే పరిస్థితి ఎదురుకావటంతో అమిత్ షా రంగంలోకి దిగారు. మంతనాలు నడుపుతున్నారు. మరోవైపు శిరోమణి అకాలీద్ ను బుజ్జగిస్తున్నారు. బీహార్ కు చెందిన జెడీయూను కాపాడుకోవడంతో పాటు.. ఒడిషాకు చెందిన బిజూ జనతా దళ్ ను దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Image result for MODI IMAGE

మిత్రపక్షమైనా.. శివసేన, బిజేపీ మీద కారాలు మిర్యాలు నూరుతోంది. ఆ పార్టీతో విబేధాలు పరిష్కరించుకునేందుకు  ఆ పార్టీ అధినేత ఉద్దవ్ థాక్రేతో బిజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు బీహార్ లో జేడీయూతోనూ బంధం బలపర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది.  పంజాబ్ లోని శిరోమణి అకాళీదళ్ కు చేరువయ్యేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఒకప్పటి మిత్రుడు.. ప్రస్తుతం దూరాం ఉన్న ఒడిసా సీఎం నవిన్ పట్నాయక్ ను తమవైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. నిజానికి బిజేపీ, శివసేల మధ్య బంధం దాదాపు 30 ఏళ్లుగా కొనసాగుతోంది. మిగతా పార్టీలన్నీ బీజేపీని వ్యతిరేకించిన సమయంలో కూడా శివసేన.. బీజేపీ వెన్నంటే ఉంది.  కాని కొంతకాలంగా ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు పొడసూపాయి. తాజా ఉపఎన్నికల ఫలితాలతో ఆవి మరింత తీవ్రమయ్యాయి. మహరాష్ట్రలోని పాల్ఘర్ పార్లమెంటరీ నియోజకవరానికి నిర్వహించిన  బిజేపీ, శివసేనల మధ్యే ప్రధానంగా పోటీ నడిచింది. అక్కడ ఓటమిని శివసేన ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. బీజేపీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగింది. ఒకనోక దశలో మహరాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం నుంచి శివసేన తప్పుకుంటుందంటూ వార్తలు కూడా వచ్చాయి. నిజానికి 1989 నుంచి.. బిజేపీ, శివసేనలు మిత్రపక్షాలే. హిందుత్వవాదంతో  మహరాష్ట్రలో తమ ఉనికి చాటుకున్నాయి. ఆ బంధం దాదాపు 25 ఏళ్ల పాటు కొనసాగింది.  2014 ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేశాయి.  2016 మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  సీట్ల పంపకాల విషయంలో ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ  ఎన్నికల్లోనే ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి.  ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. బిజేపీ అతిపెద్ద పార్టీగా, శివసేన రెండో అతిపెద్ద పార్టీగాను అవతరించాయి.  ఈ రెండు పార్టీలు కలిసే ప్రభుత్వాన్ని ఏర్పరిచాయి.

Image result for NDA ALLIANCESImage result for NDA ALLIANCES

ఒకవైపు మహరాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పటికీ.. శివసేన, కేంద్రంలో  బిజేపీ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయి విమర్శలు చేస్తూనే ఉంది. తాజాగా దేశంలో పార్టీలన్నీ కలిసి బిజేపీని ఓడించాలని పిలుపునిచ్చింది. శివసేన అండలేకపోతే కేంద్రంలోనూ, మహరాష్ట్రలోనూ బిజేపీ ప్రభుత్వం నడిపించలేని పరిస్థితి. అందుకే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా,  శివసేన నేత అమిత్ షాతో మంతనాలు జరుపుతున్నారు. బిజేపీ అడిగిన వెంటనే ఉద్దవ్ థాక్రే అపాయింట్ మెంట్ ఇచ్చారంటే.. శివసేన కూడా కాస్త మెత్తబడినట్టే కనిపిస్తోంది. గత కొంత కాలంగా... బీజేపీతో కలిసి సాగుతున్న సిరోమణి అకాళీదళ్ కూడా బీజేపీ మీద కాస్త కోపంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆపార్టీని బుజ్జగించేందుకు బిజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బిజేపి నేత అమిత్ షా, శనివారం శిరోమణి అకాళీదల్ నేతలతో సమావేశం కానున్నారు. 2014 ఎన్నికల సమయంలో ఎన్డీయే నుంచి దూరంగా వెళ్లిపోయిన నితీష్.. మళ్లీ ఇప్పుడు ఎన్డీయేలో చేరారు. అయితే నితీష్ కి చెందిన జేడీయూ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం ఆ పార్టీ   25 సీట్లు అడుగుతోంది. అయితే బీహార్ కే చెందిన రావిలాస్ పాశ్వాన్ కి చెందిన ఎల్జేపీ, ఆర్ఎల్జేపీ లు కూడా అక్కడ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలే. బీహర్ లో ఉన్నవి మొత్తం 40 సీట్లు.. 2014 ఎన్నికల్లో బీజేపీ 22 సీట్లు గెల్చుకుంది. మరి  ఆ పార్టీ జేడీయూ కి 25 సీట్లు వదిలిపెడుతుందా అంటే ప్రశ్నార్థకమే. 2014లో నితీష్ నాయకత్వంలో జేడీయూ గెల్చుకుంది కేవలం రెండు సీట్లు మాత్రమే.  దీంతో తాము ఇచ్చే సీట్లతో జేడీయూ సర్దుకుపోవాల్సిందేనని బిజేపీ నేతలు చెబుతున్నారు.  కానీ అగ్రనాయకత్వం మాత్రం  నితీష్ తో కలిసి నడవాలనే భావిస్తోంది. ఒప్పటి మిత్రపక్షమైనా బిజూ జనతాదళ్ ను కూడా దగ్గరకు తీసుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. తద్వారా ఎన్డీయేను బలోపేతం చేయాలని ప్రయత్నిస్తోంది.

Image result for OPPOSITION PARTIES

మొన్నటి ఉపఎన్నికల్లో దాదాపు అన్నీ పార్టీలు ఏకమై బీజేపీ ని ఓడించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. యూపీలో ఖైరాన్ లో..  ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీ ఇలా అన్ని పార్టీలు కలిసి బీజేపీ మీద పోటికి దిగాయి. కాషయదళానికి చుక్కలు చూపించాయి. ఉపఎన్నికల ఫలితాలతో అన్ని పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పాడి బిజేపీకి వ్యతిరేకంగా పోటీ చేయాలన్న వాదన క్రమక్రమంగా బలపడుతోంది. బిజేపీని ఓడిచడానికి ఇదే ఏకైక మార్గమని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఈ మహాకూటమిని దీటుగా ఎదుర్కోవాలంటే.. తన మిత్రులు చేజారిపోకుండా చూసుకోవాలని బిజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త మిత్రుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: