పిచ్చి పీక్స్ కు చేరినా, అహంభావం నెత్తి కెక్కినా చెసే పనుల్లో పెద్ద తేడా ఏమీ ఉండదు. అలాంటి వాటిల్లో ఒకటే, తెలంగాణా ముఖ్యమంత్రి 25 లక్షల మందితో నిర్వహించిన ‘ప్రగతి నివేదన సభ’. భారీ బహిరంగ సభ గా నిర్వహించి, అందర్నీఅన్నీ పార్టీలను సంభ్రమాశ్చర్యాలకు విస్మయానికి గురిచేయాలనుకున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. 


నః భూతో నః భవిష్యతి” అనేలాగా ఏర్పాట్లు తారస్థాయి స్థాయిలోనే జరిగాయి. ఆయన అనుకున్నట్లు జనసమీకరణ కూడా అదే స్థాయిలో తరలించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేయటం జరిగింది. అయితే ఇక్కడ హాజరైన జన సంఖ్య సంగతేమో గానీ, అనుకున్న స్థాయిలో వాహనాలైతే వచ్చాయి. జనం, వాహనాల సంగతీ అలా ఉంచితే - 'మద్యం – ముక్క – పొట్లం (బిర్యాని)  కోసం ఖర్చు ఒక రేంజ్‌ లో ఉందట. పార్టీ నషాళానికి అంటిందని అభిఙ్జవర్గాల కథనం. 



రాజకీయపార్టీలు నిర్వహించే చాలా కార్యక్రమాల్లో  'మందు'  చాలా చాలా సహజం. మందు, ముక్క, బిర్యాని పొట్లం లేకుండా ఏ పని జరగదనే స్థాయికి తెలంగాణా రాష్ట్ర రాజకీయాలు దిగజారి పోయాయి.  అయితే, ప్రగతి నివేదన సభ కోసం వచ్చిన,  'గులాబీ పార్టీ అభిమానులు' మద్యంతో రెడ్‌ హ్యాండెడ్‌గా ప్రజలందరికి దొరికిపోవటంతో రాజకీయుల వేషాల నగ్న స్వరూప, నగ్నసత్యం బట్టబయలైంది. బస్సుల్లోనూ, కార్లలోనూ, సభా ప్రాంగణంలోనూ, ఇతర చోట్లా, ఎక్కడి కక్కడ ఎలాబడితే అలా మద్యం మత్తులో జోగారు. 
pragati nivedana sabha and liquor flow కోసం చిత్ర ఫలితం
ఆకాశంలో సగం, అన్నింటా సగం, అనుకున్నారో ఏమో!  తెలంగాణా మహిళలూ సైతం మద్యం మత్తులో ఊగి, తూగి, జోగి పోయారు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా 'ప్రగతి నివేదన సభ' అంచనాల్ని అందుకోలేక -టిఆరెస్ నాయకులకు ‘ప్రగతి ఆవేదన సభ’ గా మారిపోయింది. 
chicken pieces and biryani కోసం చిత్ర ఫలితం
*ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగం కావొచ్చు, 
*ముందస్తు ఎన్నికలపై ఆయన క్లారిటీ ఇవ్వకపోవడం కావొచ్చు.. 
*కేసీఆర్‌ ఏదన్నా వేదికపై మాట్లాడితే, ఆ మాటల్లో ఫోర్స్ పవర్‌ రెండూ ఉంటాయి. కేసీఆర్‌ ఎన్ని గంటలపాటు ప్రసంగించినా, ఇంకా ఇంకా మాట్లాడితే బావుంటుందని అనిపిస్తుంది. కాని అది జరగలేదు ఆయన స్పీచ్ లోను నీరసం ద్వనించించగా జనం మరింత డల్లై మందు మత్తు నెత్తికెక్కింది   


*ఆయన అలా మాటలతో మాయా మోహనం మరోమాటలో మెస్మరైజ్‌ చేస్తారు.  ఆ మ్యాజిక్‌ ప్రగతి నివేదన సభలో కన్పించక ఆవేదన కనిపించింది. 
*కేసీఆర్‌ ఇలా స్వయంగా ‘ప్రగతి నివేదన సభ’ ను నీరు గార్చగా జనం నిరుత్సాహపడడం. 
*ఎక్కడ చూసినా మద్యం సీసాలు గ్లాసులే దొర్లటం   
*వెరసి ఈ మొత్తం ఎపిసోడ్‌ లో  'గులాబీ' పార్టీ ‘పరువు’ పోయింది. 'ప్రతిష్ఠ' కు గండి పడింది. కేసీఆర్‌ సర్కార్‌ అభాసుపాలపాలవటం సంపూర్ణం.  


ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను అత్యంత జాగ్రత్తగా చూసుకున్న మంత్రి కేటీఆర్‌ సామాజిక సమాచార వ్యవస్థలో అంటే సోషల్‌ మీడియాలో తనపై వచ్చి పడ్తోన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దురవస్థ పరిస్థితి ఏర్పడింది. ప్రగతి నివేదన సభ కాదు ఇది “మందు-ముక్క-పొట్లం నైవేద్య సభ” అంటూ సెటైర్లు వేస్తున్నారు.



“జనాన్ని రప్పించడమంటే, ఇలా మందు పోసి వారిని మత్తులో తూగేలా చేసి రప్పించడమా?  అని ప్రశ్నిస్తున్నారు జనం. ఆ ప్రశ్నలకు కేటీఆర్‌ మాత్రం ఎలా సమాధానం చెప్పగలరు?  ప్రగతి నివేదన సభ కోసమే, మంత్రివర్గ సమావేశానికీ ఆయన దూరమయ్యారు కేటీఆర్‌. 

kcr ktr kavita కోసం చిత్ర ఫలితం

కేసీఆర్‌ సంగతేమోగానీ, సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే కేటీఆర్‌ 'మద్య నివేదన' పై ఏవిధంగా స్పందించాలో ఆవేదన లో పడిపోయారట. మందు + ముక్క + పొట్లం -  ఒక పాకేజీ - ఇవి ఎన్ని సరపరా చేస్తే అంతమంది తెలంగాణా వాసుల్ని మహిళలతో సహా బహిరంగ సభలకు రప్పించవచ్చు అనేది ఋజువైంది. = ప్రగతి (ఆ)నివేదన సభ ద్వారా.  రాష్ట్ర ప్రజల పరువు హిష్! కాకి! 

మరింత సమాచారం తెలుసుకోండి: