జనసేన పార్టీ ఖాళీ చేసిన కార్యాలయం భవనంలో బార్ అండ్ రెస్టారెంటు ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు నగర శివారులోని ఇన్నర రింగ్ రోడ్డులో ఎన్నికలకు ముందు పవన్ అట్టహాసంగా ఓ భవనంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఐదంతస్తుల భవనంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అట్టహాసంగా మొదలుపెట్టారు.

 

ఈ భవనంలో పార్టీ కార్యాలయం ప్రారంభించినా పవన్ వచ్చింది మాత్రం పెద్దగా లేదనే చెప్పాలి. మొత్తం తన వ్యవహారాలన్నింటినీ పవన్ అయితే హైదరాబాద్ నుండి లేకపోతే విజయవాడలోని బెంజి సర్కిల్ లో ఏర్పాటు చేసిన కార్యాలయం నుండి పూర్తిచేశారు. సరే ఎన్నికల్లో జనేసేన బొక్క బోర్లా పడిన విషయం అందరికీ తెలిసిందే.

 

సుమారు 140 నియోజకవర్గాల్లో జనసేన పోటి చేస్తే గెలిచింది రాజోలు నియోజకవర్గంలో మాత్రమే. చివరకు పవన్ పోటి చేసిన రెండు నియోజకవర్గాలు గాజువాక, భీమవరం లో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయాలను చాలా చోట్ల మూసేశారు.

 

ఇందులో భాగంగానే గుంటూరు నగర శివార్లలోని గోరంట్ల ఇన్నర్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని కూడా మూసేశారు. తర్వాత భవనాన్ని స్వాధీనం చేసుకున్న ఓనర్ దానిని బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయదలచుకున్న వారికి అద్దెకు ఇవ్వలాని నిర్ణయించారు. ఈ భవనంలో గనుక ఏ వ్యాపారం చేసినా జనాలకు గుర్తులు చెప్పటం చాలా తేలిక. అందుకనే భవనం ఓనర్ దీన్ని బార్ అండ్ రెస్టారెంట్ పెట్టే వాళ్ళకు అద్దెకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

 

విచిత్రమేటంటే కార్యాలయాన్ని ఖాళీ చేసేటపుడు జనసేన నేతలు పవన్ కల్యాణ్ ఫొటోలతో పాటు పార్టీ సింబల్ ఉన్న బ్యానర్లను తీయకుండానే యజమానికి ఇచ్చేశారు. దాంతొ యజమాని కూడా వాటిని తొలగించకుండానే అద్దెకు ఇవ్వటానికి బ్యానర్ ఏర్పాటు చేశారు. అందరూ దాన్నిపుడు జనసేన కార్యాలయంలో బార్ అండ్ రెస్టారెంటా ? అంటూ ఆశ్చర్యపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: