ఒకప్పుడు కాలిఫోర్నియా అటవీ ప్రాంతం పచ్చని ప్రకృతికి పెట్టింది పేరు. స్వచ్చమైన గాలి, ప్రశాంతమైన వాతవరణం ఎందరో ప్రకృతి ప్రేమికులకు ఇదో స్వర్గం. కాని గతకొంతకాలంగా ఇక్కడ చెలరెగిన అగ్నిజ్వాలలు నిర్ధాక్షిణ్యంగా ప్రకృతిని దహించి వేస్తున్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో కలకలాన్ని సృష్టించి అగ్ని కోరలు చాచి తన ఆకలిని తీర్చుకుంటుంది. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి.


ఈ ఘటనతో కాలిఫోర్నియా చుట్టుముట్టిన కార్చిచ్చుతో వేలాది మంది తమ ఇళ్లను వదిలి పారిపోతున్నారు. తీవ్రమైన వేడిగాలులతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా గంటకు 137 కిలోమీటర్ల వేగంతో వేడిగాలులు వీస్తుండగా. ఇప్పటి వరకు అగ్నికీలల్లో 23,700 ఎకరాల్లో వృక్ష సంపద ధ్వంసమైంది. 50 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇకపోతే మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు..  మరోవైపు, ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించినట్టు గవర్నర్ గేవిన్ న్యూసమ్ తెలిపారు.


ఇకపోతే భయంకరంగా వీస్తున్న  ఈదురుగాలులతో కార్చిచ్చు మంటలు విపరీతమైన వేగంతో విస్తరిస్తుండటంతో పసిపిక్‌, గ్యాస్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీకి చెందిన హైవోల్టేజ్‌ విద్యుత్‌ సరఫరా టవర్‌ ధ్వంసమైందని అధికారులు చెప్పారు. ప్రమాదకరస్థాయిలో ఈదురుగాలులు, మంటలు విస్తరిస్తుండటంతో ఈ సంస్థ విద్యుత్‌ సరఫరాను నిలిపివేసింది. దీనితో దాదాపు రెండు లక్షలకు పైగా కుటుంబాలు విద్యుత్‌ సరఫరాలేక చీకట్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఇక ఈ కార్చిచ్చుకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు కాలిఫోర్నియా అటవీ, అగ్నిమాపక విభాగం ప్రకటించింది.  ఇకపోతే ఈ సంఘటనవల్ల ప్యారడైజ్ పట్టణం తీవ్రంగా నష్టపోయింది.  27,000 జనాభా ఉన్న పట్టణ వాసులంతా ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇక ఈ పట్టణాన్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావాలంటే ఎన్నో ఏళ్లు పడుతుందని అధికారులు అంటున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: