తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంత  ప్రతిష్ట ఉందో తెలుసిందే . ఎంతో మంది భక్తులు తిరుమల వారిని దర్శించుకుని పునీతులవుతారు. ఒక తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తిరుమల వారిని దర్శించుకునేందుకు తరలి వస్తారు . ఏ సమయంలో చూసినా తిరుమల వారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. కోరిన కోరికలు తీర్చే బంగారు దేవుడు అంటూ శ్రీవారిని కొలుచుకుంటారు భక్తులు. అయితే శ్రీవారి లడ్డూ ప్రసాదం ఎంత ప్రఖ్యాత కలిగిందో అందరికీ తెలిసిందే. 

 

 

 

 శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు  ఎంతో పవిత్రంగా భావిస్తారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తీసుకువచ్చి పదిమందికి పంచడం వల్ల కొంతైనా పుణ్య ప్రాప్తి కలుగుతుందని భక్తులు భావిస్తుంటారు. కాగా తిరుమల వారి లడ్డూ ప్రసాదంలో  రోజురోజుకు నాణ్యత లోపిస్తుంది. పరిమాణంలోనే కాకుండా నాణ్యతలో కూడా తిరుమల వారి లడ్డూ ప్రసాదం లో నిర్లక్ష్యం వహిస్తున్నారు సిబ్బంది. గతంలో భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో మేకులు  తదితర వస్తువులు రావడం సంచలనం గా మారిన విషయం తెలిసిందే. 

 

 

 

 భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో  మరోమారు వెంట్రుకలు దారాలు వచ్చాయి. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో సిబ్బంది నిర్లక్ష్యానికి ఇది మరొక ఉదాహరణ. హైదరాబాద్ మల్కాజ్ గిరి  ప్రాంతానికి చెందిన భక్తులు... ఇటీవలి శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లి వచ్చారు. అయితే ఇంటికి తిరిగి వచ్చాక లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించేందుకు తెరిచి చూడగా లడ్డూలో పూర్తిగా వెంట్రుకలు దారాలు చూసి అవాక్కయ్యారు. ఈ విషయం కాస్త నలుగురికి పొక్కడంతో భక్తులంతా తిరుమల ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించడం ఏంటని పెదవి విరుస్తున్నారు  వ్యక్తం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: