నేటి నుండి పార్లమెంట్ శీతాకాల సమేవేశాలు జరుగుతేన్నాయన్న విషయం తెలిసిందే. కాగా పార్లమెంట్ ముట్టడికి  జేఎన్యూ  విద్యార్థి సంఘాలు బయలుదేరాయి. ఎంతో  ప్రతిష్ట కలిగిన జేఎన్యూ   విద్యార్థులు ప్రస్తుతం నిరసన బాట పట్టారు. జేఎన్యూ లో  ఒక్కసారిగా ఫీజులను  రెట్టింపు చేయడం మెస్ ఛార్జీలు కూడా పెంచేయటం సహా  డ్రెస్ కోడ్ విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని  విద్యార్థి సంఘాలు నిరసన బయటపట్టాయి . గత కొన్ని రోజులుగా జేఎన్యూ  విద్యార్థి సంఘాలు ఢిల్లీలో తీవ్ర నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తున్నాయి విద్యార్థి సంఘాల నిరసనలు.ఇప్పటికే జేఎన్యూ ను  ముట్టడించి  విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.ఒక్క సరిగా ఫీజులను  రెట్టింపు చేయడంతో  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం  అంటూ నిరసన వ్యక్తం చేశారు. 

 

 

 

 జేఎన్యూ  పెంచిన మెస్  ఛార్జీలను తాము చెల్లించ లేకుండా ఉన్నామని అంతేకాకుండా ఫీజులన్నింటిని  రెట్టింపు చేశారని జేఎన్యూ  విద్యార్థి సంఘాలు నిరసన తెలిపిన ఎవరు తమ సమస్యలను పట్టించుకోక పోవటంతో పార్లమెంట్ ముట్టడి చేయాలనీ నిర్ణయించినట్లు తెలుస్తుంది . గత కొద్ది రోజుల క్రితం భారీ సంఖ్యల జేఎన్యూ  ముట్టడికి  ప్రయత్నం చేసిన విద్యార్థి సంఘాలు... దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది విషయం తెలిసిందే. కాగా తాజాగా ఢిల్లీలో పార్లమెంటు ముట్టడికి విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. నిరసనలు తెలిస్తే సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని భావించిన చేయాలని విద్యార్థి సంఘాలు నేడు శీతాకాల సమావేశాలు పార్లమెంటులో ప్రారంభం కావడంతో పార్లమెంటు ముట్టడి తోనే తమ  సమస్యలు పరిష్కారమవుతాయని విద్యార్థి సంఘాలు తెలిపాయి. 

 

 

 

 దీంతో పార్లమెంట్ పరిసరాలన్నీ హాట్ హాట్ గా మారిపోయాయి. జేఎన్యూ  విద్యార్థి సంఘాలు ఎప్పుడు పార్లమెంటు ముట్టడికి యత్నించకుండా   పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో పార్లమెంట్ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఎవరైనా విద్యార్థులు పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపేందుకు వస్తే అరెస్టు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఆవరణలో భారీగా పోలీసులు మోహరించారు. జేఎన్యూ  విద్యార్థి సంఘాల పార్లమెంటు ముట్టడికి యత్నం చేయకుండా అడ్డుకునేందుకు సంసిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఆవరణలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చూసుకోకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: