హైదరాబాద్ షాద్ నగర్ లో వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు లారీ డ్రైవర్లు కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి పెట్రోల్ పోసి ఆమె శవాన్ని ముట్టుకొనేకి కూడా లేకుండా పెట్రోల్ పోసి కాల్చిపడేసిన నీచులను పోలీసు కేవలం పదిరోజులలో నలుగురిని ఒకేసారి ఎన్కౌంటర్ చేసేశారు. దీంతో ఆ నీచులు అంత అక్కడిక్కడే మృతి చెందారు. 

 

ఆ వార్త విన్న ప్రజలు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. మొదటిసారి ఒక మహిళకు అతి తక్కువ సమయంలో న్యాయం జరిగింది అంటూ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆ నీచుల ఎన్కౌంటర్ తో కొద్దీ మందికి అయినా భయం కల్గుతుంది అని అందరూ భావించారు కానీ ఎంతో మంది నీచులకు ఆ ఎన్కౌంర్ ని అసలు చీమ కుట్టినట్టు కూడా లేదు.

 

అయితే ఒక్క నీచుడికి మాత్రం అది భయం పట్టుకుంది. దీంతో వాడు ఆ ఎన్కౌంటర్ కి బయపడి ఉరేసుకొని చచ్చాడు. ఆలా చచ్చాడు అని వాడేదో అమాయుడుకు అనుకునేరు.. వాడు ఓ పెద్ద నరరూప రక్షేషుడు. ఆ రక్షేషుడు మాములు నేరాలు చెయ్యలేదు. ఆ నేరాలు ఏంటి అంటే కుటుంబ కలహాలతో ఉన్మాదిగా మారి, నిద్రిస్తున్నవారిపై టర్పంటైన్‌ పోసి.. కట్టుకున్న భార్యను, కన్న కూతురు సహా నాలుగు నిండు ప్రాణాలు బలిగొన్న ఆ దుర్మార్గుడు వాడు. 

 

15 రోజులుగా దొరక్కుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న ఆ కర్కోటకుడు 'ఎన్‌కౌంటర్‌' భయంతో తనను తాను అంతం చేసుకున్నాడు. ఏనాటికైనా పోలీసులకు తాను దొరక్క తప్పదని.. దొరికితే 'దిశ' కేసు నిందితుల తరహాలో తనను ఎన్‌కౌంటర్‌ చేస్తారేమోనన్న భయంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏది ఏమైతేనేం ఒక్క నీచుడు అయినా ఎన్కౌంటర్ భయంతో చచ్చిపోయాడు. ఆత్మహత్య కాబట్టి ఇప్పుడు మానవహక్కుల సంఘం కూడా ఏమి చెయ్యలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: