తెలుగుదేశంపార్టీ నేతలు జేసి బ్రదర్స్ ఇలాకా తాడిపత్రిలో రివర్స్ బిజినెస్ నడుస్తోందా ? అనే అనుమానం మొదలైందట. జేసి బ్రదర్స్ ఇలాకా ఏమిటి ? రివర్స్ బిజినెస్ ఏమిటి ? అని తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.  విషయం ఏమిటంటే మద్యం వ్యాపారంలో ధరలు ఎక్కువ చేసి అమ్ముకోవటం అందరికీ తెలిసిందే. లక్షల రూపాయల ఫీజులు చెల్లించుకోవటంలో ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగా కొన్ని చోట్ల చిలక్కొట్టుడు లాగ ధరలు పెంచేయటం అందరికీ తెలిసిందే.

 

మరి దానికి రివర్సులో అంటే ధరలు తక్కువ చేసి అమ్ముతున్నారంటే అర్ధమేంటి ? రివర్స్ బిజినెస్ అనే కదా . జేసి ఇలాకాగా పాపులరైన తాడిపత్రిలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో ఇపుడిదే జరుగుతోందట. ఉన్న మూడు బార్ అండ్ రెస్టారెంట్లు కూడా జేసి మద్దతుదారులవే అని సమాచారం. అందులోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో అమ్మాల్సిన ధరకన్నా అంటే ఎంఆర్పి కన్నా ఓ 30 రూపాయలు తక్కువకే మద్యం అమ్ముతున్నారట.

 

నిజంగా ఈ వార్త మందుబాబులకు కిక్కేచేదే అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడే అందరికీ ఓ అనుమానం కూడా పెరిగిపోతోంది. అదేమిటంటే ఈ బార్ లో ఓ పెగ్గు తీసుకోగానే వెంటనే కిక్కు ఎక్కిపోతోందట. మామూలుగా అయితే మందుబాబుల కెపాసిటి ప్రకారమైతే రెండు మూడు పెగ్గులు తాగినా కూడా కిక్కు ఎక్కకూడదు. అలాంటిది ఒక్క పెగ్గుకే కిక్కు ఎక్కడమేంటి ?

 

ఇక్కడే అనుమానాలు పెరిగిపోయాయి. బెంగుళూరు నుండి సరుకును దొంగతనంగా తెప్పించుకుని అమ్ముతున్నారా ? లేకపోతే చీప్ లిక్కర్ ను బ్రాండెడ్ మద్యంలో కలిపేసి అమ్ముతున్నారా ? అన్న సందేహాలు పెరిగిపోతున్నాయి.  పైగా తమ బార్లలో ఎంఆర్పి ధరలు 30 రూపాయలు తక్కువకే అమ్ముతున్నట్లు పే...ద్ద బ్యానర్ ను పెట్టి మరీ అమ్ముతున్నారట. నిజానికి ఎంఆర్పికన్నా తక్కువకి లేదా ఎక్కువకి కూడా అమ్మకూడదు. మరి జేసిల రివర్స్ బిజినెస్ మర్మమేంటో వాళ్ళే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: