గత నెల 27న దేశప్రజాలను కాల్చివేసిన ఘటన హైదరాబాద్, షాద్ నగర్ లో జరిగింది. ఆ ఘటన చుసిన ప్రతి ఒక్కరికి కంట నీరు ఆగదు. ఆ ఘటనే దిశ ఘటన. చికిత్స నిమిత్తం బయటకు వెళ్లిన వెటర్నరీ వైద్యురాలైన దిశపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి సజీవ దహనం చేశారు. 

 

అయితే ఘటన జరిగిన 24గంటల్లోనే పోలీసులు ఆ నిందితులను పట్టుకోగా.. వారే అత్యాచారం చేసి హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. దీంతో వారిని హైకోర్టులో హాజరుపరచగా నలుగురిని 14 రోజులు రిమాండ్ లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. అయితే పోలీసులు విచారణలో భాగంగా కేసు రీకాన్స్ట్రక్షన్ లో భాగంగా వారిని ఘటన స్థలానికి తీసుకెళ్లగా అక్కడ పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. 

 

దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నలుగురు నిందితులపై కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో నలుగురు నిందితులు మృతిచెందారు. ఇంకా అక్కడే ఆ నిందితులకు పోస్టుమార్టం చేశారు. అయితే ఆ నిందితుల ఎన్కౌంటర్ పై మహిళా సంఘాలు కోర్టులో పిటిషన్ వెయ్యగా ఆ నలుగురి అంత్యక్రియలు పూర్తవుతాయి అనుకున్న సమయంలో కోర్టు అంతక్రియలకు బ్రేక్ వేసింది. 

 

ఆతర్వాత మానవ హక్కుల సంగం బరిలోకి దిగి విచారణ జరపగా.. కోర్టు విచారణ జరిపి జరిపి నిన్న ఆ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం చేసి నిందితుల మృతుదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో ఆ నిందితులు డిసెంబర్ 6న మరణించగా నిన్న వారి సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు పూర్తయ్యాయి.

 

అయితే మహ్మద్‌ ఆరిఫ్‌, జొల్లు శివ, జొల్లు నవీన్‌, చెన్నకేశవులు అంత్యక్రియలు వారి మత, కుల సంప్రదాయాల ప్రకారం సోమవారం రాత్రి జరిగాయి. ఆరి్‌ఫను జక్లేర్‌లోని శ్మశాన వాటికలో ఖననం చేయగా, చెన్నకేశవులు అంత్యక్రియలు స్వగ్రామంలోనే జరిగాయి. కాగా జొల్లు నవీన్‌, జొల్లు శివలకు పెళ్లి కాకపోవడంతో సంప్రదాయం మేరకు వారికి ముందుగా కత్తితో వివాహం జరిపించారు. రాత్రి 8 గంటల తర్వాత వారి సంప్రదాయాల ప్రకారం వారి వ్యవసాయ భూముల్లో ఖననం చేశారు. దీంతో నేటితో దిశ కథ ముగిసింది అని చెప్పచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: