కొన్ని రోజుల నుండి భైంసా ప్రాంతం మొత్తం అట్టుడుకుతున్న  విషయం తెలిసిందే. భైంసా పట్టణంలో జరుగుతున్న అల్లర్లు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. దీంతో బైంసా  అల్లర్లను అదుపులోకి తీసుకు రావడం పోలీసులకు సవాల్ గా మారిపోయింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఈ అల్లర్లు చేయించే దిశగా ముమ్మర కసరత్తు చేస్తున్నారు. అసలు భైంసా లో చెలరేగిన అల్లర్ల వెనుక ప్రధాన కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా కూపీ లాగుతున్నారు పోలీసులు. అల్లర్ల వెనుక ప్రధాన సూత్రధారులు ఎవరు అని చేదించే పనిలో పడ్డారు. ఇక బైంస ఘటనపై కేంద్ర పోలీస్ శాఖ ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా రంగంలోకి దిగి ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇప్పటికే అల్లర్లపై 17 కేసులు నమోదు చేసి 67 మంది అల్లర్లు చేస్తున్న అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

 

 

 ఆగ్రహావేశాలకు లోనైన కొంతమంది యువత అల్లర్ల సమయంలో పోలీసు కేసుల్లో చిక్కిపోయి తమ కెరీర్ ని నాశనం చేసుకుంటున్నారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అల్లర్లు జరిగిన పాతబస్తీ ప్రాంతంలో 90 శాతానికి పైగా ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. భయాందోళనకు గురైన ఇరు వర్గాల ప్రజలు ఇళ్లకు తాళాలు వేసుకుని వేరే ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ఇప్పటికే బైంసా  అల్లర్ల నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. గత మూడు రోజుల నుండి పోలీసుల కస్టడీలో ఉన్న బైంసా పట్టణం. ఇక గురువారం ఉదయం నుంచి ఆంక్షలు సడలించారు పోలీసులు. రాత్రివేళల్లో మాత్రం  పోలీసులు ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలు ముగిసేదాకా పోలీసులు బైంసా పట్టణాన్ని తమ ఆధీనంలోనే ఉంచుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. 

 

 

 ఇకపోతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బైంసా అల్లర్లపై సమాచారం తరలిపోకుండా ఉండడానికి ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపి వేశారు. ఇంటర్నెట్ ద్వారా అల్లర్లను ఉద్రిక్తంగా మార్చాలి  అనుకునే వారు సమాచారాన్ని ఇతర వ్యక్తులకు పంపించేందుకు వీలు ఉంటుంది. కాబట్టి ప్రజలు శాంతిభద్రతల దృష్ట్యా... ఇంటర్నెట్ సేవలను నిలిపి వేశారు. వాట్సాప్ ఫేస్బుక్ తో పాటు ట్విట్టర్ లాంటి సేవలు నిలిచిపోయాయి. అయితే ఇంటర్నెట్ సేవలను నిలిపి వేయడంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ... పోలీసులు మాత్రం ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించేందుకు అనుమతించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: