నిర్భయ కేసు... ఈ పదాన్ని భారతీయులు గత 7 సంవత్సరాల నుంచి వింటూ వస్తున్నారు. దీనికి కారణం దేశ రాజధాని అయినా ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మొత్తం నలుగురిని తీహార్ కేంద్ర కారాగారంలో ఉంచి కేసు విచారించడం. అనేకమార్లు అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసుకు నేటితో ఉరి కంబాన్నిఎక్కించడంతో ఈ కేసుకి తెరపడింది. కాకపోతే ఇలా జరిగిన  కొన్ని నిమిషాల వ్యవధిలో మరో కొత్త డిమాండ్‌కు తెర లేచింది. 

 

 


అత్యాచారానికి బాలి అయిన నిర్భయ కుటుంబ సభ్యులు, ఢిల్లీ ప్రజలు ఈ డిమాండ్‌ ను మొదుకు తెచ్చారు. ప్రస్తుతం ఈ డిమాండ్‌ తో తీహార్ జైలు ఎదురుగా ప్లకార్డులను సైతం వారు అక్కడ ప్రదర్శించారు. అయితే వారు లేవనెత్తిన డిమాండ్ పట్ల కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం ఏమిటంటే, అసలు ఆ డిమాండ్ ఏమి అంటే "న్యాయ దివస్". 

 

 


"న్యాయ దివస్" అసలు ఏమి అన్న విషయానికి వస్తే... నిర్భయ దోషులను ఉరి తీసిన మార్చి 20వ తేదీని "న్యాయ దివస్‌" గా ప్రకటించాలని ఢిల్లీ ప్రజలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. 7 సంవత్సరాల తర్వాత నిర్భయకు న్యాయం కలిగిందని, ఈ రోజిని "న్యాయ దివస్" మార్చాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. కపై ఎవరైనా అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడాలనుకునే వారికి ఒక భయం పుట్టేలా, అలాంటి వారికి ఆలోచనాధోరణి మార్చేలా ఈ ఉరిశిక్ష వారికీ గుర్తుకు రావాలని వారు అంటున్నారు. ఇంకోసారి అమ్మాయిలపై ఎవరైనా అత్యాచారానికి పాల్పడాలనే ఆలోచన కూడా రాని విధంగా ఈ ఉరిశిక్షను అమలు చేసిన రోజును "న్యాయ దివస్‌"గా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే నేటి తెల్లవారు జామున సరిగ్గా 5:32 నిమిషాలకు నిర్భయ దోషులని ఉరి  తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: