ఈరోజు ఉదయం 5:30 గంటలకు నిర్భయ కేసులో ని నలుగురు నిందితులకు తీహార్ జైలులో ఉరి అమలైన విషయం తెలుసిందే.  దాదాపు ఎనిమిదేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అర్ధరాత్రి సమయంలో 23 ఏళ్ల నిర్భయ అనే యువతిపై ఆరుగురు నిందితులు అతి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశం మొత్తాన్ని ఒక్కసారికి ఉలిక్కిపడేలా చేసింది . ఇక ఆ తర్వాత నిర్భయ కేసులో నిందితులను శిక్షించేందుకు నిర్భయ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయినప్పటికీ నిర్భయ కేసులో నిందితులకు సత్వర శిక్ష  పడలేదు. కోర్టులు  ఉరిశిక్ష విధించిన చట్టంలో ఉన్న అన్ని అవకాశాలను నిర్భయ నిందితులకు వినియోగించుకోవడం వల్ల ఇన్ని రోజుల పాటు వాయిదా పడుతూ వచ్చింది. ఇక నిర్భయ కేసులో నిందితులకు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలు అయిపోవడంతో ప్రస్తుతం ఉరికంభం ఎక్కక  తప్పలేదు. 

 

 నిన్న నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ పటియాల హౌస్ కోర్టు తీర్పునివ్వడంతో  ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు నిర్భయ  కేసులోని నలుగురు నిందితులకు తీహార్ జైలులో ఉరి శిక్ష అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందుగా నిర్భయ నిందితులను చివరి కోరిక ఏమిటి అని జైలు అధికారులు అడగగా... నలుగురు నిందితుల్లో  ఒకరైనా ముఖేష్ సింగ్ గొప్ప పని చేసాడు.చివరి కోరికగా అవయవదానానికి కోరుకున్నాడు. తన  మరణానంతరం తన  అవయవాలను దానం చేసేందుకు అంగీకరించాడు దోషి ముఖేష్. ఈ విషయాన్ని నిందితుడు ముఖేష్ సింగ్ రాతపూర్వకంగా తెలిపాడు అంటూ తీహార్ జైలు సిబ్బంది చెప్పారు. ఇక నిర్భయ కేసులో మరో దోషి వినయ్ శర్మ.. తాను  వేసిన పెయింటింగ్ లను జైలులోనే ఉంచాలంటూ సూపరిండెంట్ ని కోరారు. 

 


 అంతేకాకుండా తన వద్ద ఎల్లప్పుడూ ఉంచుకునే హనుమాన్ చాలీసాను తన కుటుంబ సభ్యులకు అప్పగించాలి అంటూ ఓ ఫోటోగ్రాఫర్ కి అందించాడు. ఇక నిర్భయ కేసులో మరో ఇద్దరు నిందితులు అయిన పవన్ గుప్త,  అక్షయ్  సింగ్ లు  మాత్రం ఎటువంటి చివరి కోరిక లేదు అంటూ తెలిపారు. నిర్భయ కేసులోని నలుగురు నిందితులకు ఉరి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నిహాల్ బన్సాల్  ఈ రోజు ఉదయం నాలుగు గంటల 45 నిమిషాలకు తీహార్  జైలుకు వెళ్లి  నలుగురు నిందితులు చివరి కోరిక ఏమిటి అని అడిగి లిఖిత  పూర్వకంగా తీసుకున్నారు. ఆ తర్వాత 30 నిమిషాలపాటు నిర్భయ దోషులకు ఉరి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: