ఈ కరోనా సమయంలో పేదవాడికి ప్రతి రూపాయి విలువైనదే.. అందుకే డబ్బులను జాగ్రత్తగా వాడుకుంటే కొంతవరకైన తిప్పలు తప్పుతాయి.. ఇక ఈ మధ్యకాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య ఏంటంటే గ్యాస్ బుక్ చేసుకుంటే దానికి కట్టిన అమౌంట్‌లో కొంత సబ్సిడి కింద వస్తుంది.. అయితే ఈ డబ్బులు చాలా మంది అంకౌంట్‌లో పడటం లేదు.. ఈ విషయంలో పరేషాన్ అవుతున్నారు.. బ్యాంక్ వెళ్లితే డీలర్ దగ్గరికి, డీలర్ దగ్గరికి వెళ్లితే బ్యాంక్‌కు ఇలా తిప్పడం తప్పితే పని అవడం లేదు, డబ్బులు పడ్డాయో, పడతాయో తెలీడం లేదు..

 

 

ఇదిలా ఉండగా ఈ సబ్సిడి డబ్బులు మన అకౌంట్‌లో పడుతున్నాయా లేవా తెలుసుకోవాలంటే కాళ్లకున్న చెప్పులు అరిగేలా తిరగవలసిన అవసరం లేదు.. ఇంటి నుండే తెలుసుకోవచ్చు.. ఇందుకు గాను ముందుగా మీ సిలిండర్ కంపెనీ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన తర్వాత, చెక్ పహల్ స్టేటస్ అనే లింక్‌ వస్తుంది.. దానిపై క్లిక్ చేయాలి. అప్పుడు కనిపించే రెండు ఆప్షన్లలో స్టేటస్ తెలుసుకోవచ్చు. డిస్ట్రిబ్యూటర్ పేరు, ఎల్‌పీజీ ఐడీ లేదా ఆధార్ కార్డు నెంబర్, కన్సూమర్ ఐడీ ఎంటర్ చేసి ఓకే చేయాలి. లేదంటే డిస్ట్రిక్ట్, స్టేట్, డిస్ట్రిబ్యూటర్, కన్సూమర్ నెంబర్ వంటి వివరాలు ఎంటర్ చేసి ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు స్టేటస్ తెలుస్తుంది.

 

 

ఒకవేళ నిత్యం వాడే బ్యాంకు ఖాతా కాకుండా ఏదైనా బ్యాంకు రుణం కోసం కొత్తగా తెరిచిన ఖాతాకు ఆధార్‌ అనుసంధానం చేస్తే, ఆ సమాచారం నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) కు వెళుతుంది.. దీంతో ఆటోమేటిగ్గా రాయితీ పడే ఖాతా మారిపోతుంది.. ఈ విషయాన్ని గ్రహించక చాలామంది పాత అకౌంట్‌నే చెక్ చేసుకుంటారు.. ఒకవేళ ఇలా గనుక జరిగితే ఆ కన్‌ఫ్యూజన్ లేకుండా గ్యాస్ డబ్బులు ఏ ఖాతాలో పడతున్నాయో మీ మొబైల్‌ ద్వారానే తెలుసుకోవచ్చు..

 

 

ఇందుకు గాను మీ మొబైల్‌లో *99*99# డయల్‌ చేయాలి.. వెంటనే మీ ఆధార్‌ నంబరు అడుగుతుంది.. దాన్ని ఎంటర్‌ చేసి కన్ఫమ్‌ చేయడానికి 1 నొక్కాలి.. అంతే మీ ఆధార్‌ నంబరు చూపిస్తూ అది ఏ బ్యాంకుకు అనుసంధానమైందో.. చివరి సారి ఎప్పుడు రాయితీ పడిందో తెలుపుతుంది.. ఇప్పటికి సమస్య పరిష్కారం కాకుంటే అన్ని గ్యాస్‌ సంస్థల ఫిర్యాదులకు కాల్ చేసి మాట్లాడవచ్చూ.. ఈ టోల్‌ ఫ్రీ నం.18002333555.. హెచ్‌పీ గ్యాస్ 24 గంట‌ల కాంటాక్ట్ నంబ‌రు - 96660 23456.. భార‌త్ గ్యాస్ 24 గంట‌ల కాంటాక్ట్ నంబ‌రు9440156789.. లేదా చివరి ప్రయత్నంగా బ్యాంక్‌ అధికారులను సంప్రదించండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: